Movie News

అంత వీజీ కాదు బిగ్ బాస్

విదేశాల్లో మొదలై.. ఆ తర్వాత హిందీలో అడుగు పెట్టి.. మూడేళ్ల కిందట తెలుగునాట అరంగేట్రం చేసిన ‘బిగ్ బాస్’ షో విషయంలో విమర్శలు, అభ్యంతరాలకు లోటు లేదు. ఐతే ఎవరేమన్నా దీనికి టీవీక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న మాట వాస్తవం.

‘బిగ్ బాస్’ను తిట్టిన వాళ్లు కూడా ఆ తర్వాత దాని వీక్షకులుగా మారిన వాళ్లే. ఎవరో ఎందుకు ఈ షో కాన్సెప్టే తనకు నచ్చదంటూ విమర్శలు చేసిన అక్కినేని నాగార్జున.. గత ఏడాది హోస్ట్‌గా మారాడు. వరుసగా రెండో ఏడాది కూడా ఆయనే షోను నడిపించబోతున్నాడు.

ఐతే గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి ‘బిగ్ బాస్’కు అంత హైప్ కనిపించట్లేదు. ఇందుకు కారణాలు అనేకం. గత ఏడాది నాగ్ హోస్ట్ స్కిల్స్ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మళ్లీ ఈ ఏడాది కూడా ఆయనే కొనసాగడంతో కొంత ఆసక్తిని తగ్గించింది. కొత్త హోస్ట్ వస్తాడా.. మళ్లీ ఎన్టీఆర్‌‌ను ఏమైనా చూస్తామా అని చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.

మరోవైపు ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న వాళ్లలో చాలామంది అందులోకి రావాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీ జనాల్లో ఆ షోలో పాల్గొనడంపై అంత మంచి అభిప్రాయం లేక ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో పార్టిసిపెంట్లు రావట్లేదు. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న పేర్లలో ఎగ్జైట్ చేస్తున్నవి తక్కువే. మరోవైపు కరోనా తాలూకు భయాలు, ఆందోళనలు, బాధల్లో మునిగిపోయి ఉన్న జనాలు ఈ షో పట్ల ఇప్పటికైతే అంత ఆసక్తిని ప్రదర్శించట్లేదు.

సోషల్ మీడియాలో షో గురించి చర్చే లేదు. ఐతే ఒకసారి షో మొదలయ్యాక కథంతా మారిపోవడం ఖాయం. రెండో సీజన్లో కౌశల్ వ్యవహారం లాగా షో మలుపు తిరిగితే అందరూ అటు వైపు చూస్తారు. ఇక్కడ నాగ్ కూడా షోను నడిపించడంలో నైపుణ్యం చూపించాల్సి ఉంది. కరోనా కారణంగా థియేటర్లలో సినిమాలు లేవు. టీవీల్లో ఆసక్తికర ప్రోగ్రాంలూ లేవు. ఇలాంటి సమయంలో వస్తున్న ‘బిగ్ బాస్’ కొంచెం ఆసక్తికరంగా సాగినా టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కావడం ఖాయం.

This post was last modified on September 6, 2020 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బేబీని టెన్షన్ పెడుతున్న పుష్ప 2?

బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…

39 minutes ago

పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…

43 minutes ago

రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…

1 hour ago

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

2 hours ago

అమిత్ షాకు షర్మిల కౌంటర్

పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…

2 hours ago

పార్ల‌మెంటు ముందే అధికార-ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌

దేశ చ‌రిత్ర‌లో.. ముఖ్యంగా ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ప‌రిఢ‌విల్లుతున్న భార‌త దేశంలో తొలిసారి ఎవ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న‌..…

3 hours ago