ఈ మధ్య ముంబైకి తెగ తిరుగుతున్న రామ్ చరణ్ ఒక బాలీవుడ్ ప్రాజెక్టుని ఓకే చేశాడనే టాక్ అక్కడి మీడియా సర్కిల్స్ లో బలంగా తిరుగుతోంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో రెండు మూడు దఫాల చర్చలు అయ్యాయని కథ మీద ఏకాభిప్రాయం వచ్చాక ప్రకటిస్తారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం డంకీ ప్రమోషన్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగామ్ సందర్భంగా ఒక అభిమాని నేరుగా ఈ విషయాన్ని హిరానీనే అడిగాడు. దానికాయన స్పందిస్తూ అలాంటిది ఏమి లేదని, ఆర్ఆర్ఆర్ చూశాక చరణ్ మంచి నటుడని అర్థమయ్యిందని, అంతకు మించి ఏమి లేదని కుండబద్దలు కొట్టారు.
ట్విస్ట్ ఏంటంటే హిరానీ చరణ్ లు కలుసుకున్న మాట వాస్తవమే కానీ కాంబో ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో చెప్పాలేమని అక్కడి వర్గాల భోగట్టా. అయితే చరణ్ ఇప్పుడింత అర్జెంట్ గా రిస్క్ చేసి హిందీ మార్కెట్ మీద దృష్టి పెట్టే అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తెచ్చిన గుర్తింపు ఏ సినిమాలో ఏ భాషలో నటించినా డబ్బింగ్ చేసుకుంటే మార్కెటింగ్ అయిపోతుంది. అంతే కానీ హిరానీతో చేస్తే ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని ముందే ఫిక్స్ అయిపోతే కష్టం. గత ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు పఠాన్, జవాన్ లతో ఊపుమీదున్న షారుఖ్ ఖాన్ కి యావరేజ్ ఇచ్చింది హిరానీనే.
ప్రస్తుతానికి ఈ గాసిప్ స్టార్టింగ్ స్టేజిలోనే ఉంది. వచ్చే నెల గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తవుతుందని ఇన్ సైడ్ టాక్. ఆ తర్వాత వెంటనే బుచ్చిబాబు సెట్స్ లో అడుగు పెట్టాలి. ఇప్పటికే దీని మేకోవర్ మీద వర్క్ జరుగుతోంది. పూర్తి స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్న బుచ్చిబాబుకి హీరోయిన్, క్యాస్టింగ్ దొరకడం ఆలస్యం. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ పాత్ర డ్యూయల్ షేడ్స్ లో ఉంటుందని అంటున్నారు కానీ ఎంతవరకు నిజమో కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్స్ వదిలితే అర్థమవుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత బాగా గ్యాప్ వచ్చేసిన చరణ్ ఇకపై స్పీడ్ పెంచాలని చూస్తున్నాడు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు.
This post was last modified on January 26, 2024 6:37 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…