ఇవాళ కెప్టెన్ మిల్లర్ తో పాటు విడుదల కావాల్సిన అయలాన్ తెలుగు వెర్షన్ హఠాత్తుగా ఆగిపోయింది. ఉదయం, మధ్యాన్నం షోలకు బుక్ చేసుకున్న వాళ్లకు రీ ఫండ్ మెసేజులు వస్తుండగా, నేరుగా థియేటర్లకు వెళ్లి టికెట్లు కొందామనుకున్న ప్రేక్షకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏవో చివరి నిమిషం చిక్కుల వల్ల క్లియరెన్స్ రాలేదని, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ఎంతగా ప్రయత్నిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ట్రేడ్ టాక్. ఇవాళ రిపబ్లిక్ డే కావడంతో కొత్త సినిమా చూడాలని ఉత్సాహంగా ఉన్న మూవీ లవర్స్ నిరాశ పడ్డారు.
ఇవాళ కోర్టులతో సహా అన్ని కార్యకలాపాలకు బంద్ కాబట్టి ఏదైనా బయటే పరిష్కరించుకోవాలి. ఈ రోజు మిస్ అయితే ఓపెనింగ్స్ కి గండి పడినట్టే. కెప్టెన్ మిల్లర్ కి ఇది పెద్ద ప్లస్ కానుంది. శివ కార్తికేయన్ అదే పనిగా హైదరాబాద్ వచ్చి మరీ ఆయలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తమిళంలో లాగే తెలుగులోనూ ఆదరణ దక్కుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. ఇంత జరిగాక ఇలా అర్ధాంతరంగా షాక్ ఇవ్వడం ఊహించనిది. ఏపీ తెలంగాణ అన్ని చోట్ల ఎక్కడా షోలు పడే పరిస్థితి లేదు.
తమిళంతో పోలిస్తే ఇప్పటికే రెండు వారాలు ఆలస్యంగా వస్తున్న అయలాన్ కు తెలుగులో డీసెంట్ బిజినెస్ జరిగింది. డాక్టర్, డాన్, మహావీరుడులతో మంచి మార్కెట్ తెచ్చుకున్న శివ కార్తికేయన్ దాన్ని బలపర్చుకునే క్రమంలో ప్రతి సినిమాను దగ్గరుండి చూసుకుంటున్నాడు. బాష రాకపోయినా నేర్చుకుని మరీ స్పీచులు ఇస్తున్నాడు. ఒకవేళ గంటల వ్యవధిలో ఈ ఇష్యూని సాల్వ్ చేసుకుంటే సాయంత్రం నుంచి షోలు పడే ఛాన్స్ ఉంది. ఇంకోవైపు నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్లు మొదలుపెట్టిన కెప్టెన్ మిల్లర్ నిక్షేపంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
This post was last modified on January 26, 2024 12:51 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…