ఛలో రూపంలో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల భీష్మతోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేశాడు. రెండో సినిమా బ్రేక్ లో భాగమైన హీరో నితిన్ తో మరోసారి చేతులు కలిపి ఈసారి దొంగతనాల కాన్సెప్ట్ ని తీసుకున్నారు. ఇవాళ రాబిన్ హుడ్ టైటిల్ ని అధికారికంగా ప్రకటించి చిన్న వీడియో ద్వారా కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు. దాని ప్రకారం నితిన్ ఇందులో ఆధునిక దొంగగా కనిపించబోతున్నాడు. భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులనే ప్రతిజ్ఞని పాటిస్తూ వాళ్ళ పర్సులు, ఇళ్లలో నుంచి డబ్బులు, నగలు దోచుకోవడమే పనిగా పెట్టుకుంటాడు.
ఇండియా మొత్తం నాదే కాబట్టి దేశంలో నివసించే వాళ్లంతా కుటుంబమేనంటూ తన చోరీలను సమర్ధించుకునే ప్రయత్నం వెరైటీగా ఉంది. హీరోయిన్ గా ముందు రష్మిక మందన్నను అనుకున్నారు కానీ తర్వాత ఏవో కారణాల వల్ల తను తప్పుకుంది. ఆ తర్వాత శ్రీలీల పేరు వినిపించినా ఇప్పుడీ టీజర్ డీటెయిల్స్ లో నితిన్ ప్రస్తావన తప్ప ఇంకెవరి వివరాలు లేవు. సో ఇంకా ఫైనల్ అయ్యింది లేనిది తెలియలేదు. ఎంటర్ టైన్మెంట్ ని మిస్ చేయకుండా వెంకీ కుడుముల ఈసారి సీరియస్ పాయింట్ ని తీసుకున్నట్టు కనిపిస్తోంది. మైత్రి నిర్మాణం కాబట్టి క్వాలిటీ పరంగా టెన్షన్ లేదు.
నితిన్ కు గత ఏడాది మాచర్ల నియోజకవర్గం, ఈ సంవత్సరం ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు షాక్ ఇచ్చాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఇరుక్కుపోవడం వల్ల ఫలితాలు తేడా కొడుతున్నాయని గుర్తించి ఈసారి రూటు మార్చి రాబిన్ హుడ్ ని ఎంచుకున్నాడు. చిరంజీవితో సినిమా చేయి దాకా వచ్చి మిస్ చేసుకున్న వెంకీ కుడుముల సైతం హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న రాబిన్ హుడ్ లో నితిన్ చేసే చోరీలు డిఫరెంట్ గా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాదే రిలీజ్ ఉంటుందని సమాచారం.
This post was last modified on January 26, 2024 11:55 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…