టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారతదేశపు అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త వారం క్రితమే వచ్చినప్పటికీ ధృవీకరణ అయ్యే దాకా వేచి ఉండే ఉద్దేశంతో మీడియా, అభిమానూలు సంయమనం పాటించారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ కల నెరవేరింది. మొత్తం అయిదుగురికి ఈ బిరుదు ప్రకటించారు. వారిలో చిరంజీవి కాకుండా వైజయంతి మాల, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యం ఉన్నారు. పద్మశ్రీ గౌరవం మరో పదిహేడు మందికి అందించబోతున్నారు.
చిరంజీవికి దక్కిన పద్మభూషణ్ వెనుక ఎన్నో విశేషాలున్నాయి. తెలుగు చలన చిత్ర చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు (2011) తర్వాత ఈ ఘనత దక్కించుకున్న నటుడు ఈయనే. దక్షిణాది పరిశ్రమ మొత్తాన్ని తీసుకుంటే 2016లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే అందుకున్నారు. 1954లో మొదలైన పద్మభూషణ్ బిరుదుని ఇప్పటిదాకా కళలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే కేవలం 64 విశిష్ట వ్యక్తులకు అందజేశారు. వారిలో సినిమా రంగానికి చెందిన నటులు కేవలం ఆరుగురు. పైన చెప్పిన ఇద్దరు కాకుండా మిగిలినవారు వి శాంతారాం, జోరా సెహగల్, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్. వీళ్ళ సరసన చిరంజీవి చేరారు. అన్ని రంగాలు కలిపి 325 ఉన్నారు.
ఇది నిజంగా గర్వించదగిన విషయం. కేవలం హీరోగానే కాకుండా సమాజానికి ఉపయోగపడే రక్తదానం, నేత్రదానం లాంటి ఎన్నో కార్యక్రమాలతో వేలాది ప్రాణాలకు ఊపిరి పోసిన చిరంజీవి సేవా గుణాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అరవై ఏడేళ్ల వయసులో కూడా విశ్రాంతి లేకుండా నటిస్తూనే ఉన్న మెగాస్టార్ కోట్లాది అభిమానుల స్వప్నాన్ని నెరవేర్చారు. 2006లో పద్మశ్రీ అందుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ తో పాటు ఎందరో అతిరధ మహారధులు హాజరు కాగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అంతకన్నా గొప్పదైన పద్మవిభీషణుడిగా మారిన చిరు ఆనందాన్ని మాటల్లో కొలవడం కష్టమే.
This post was last modified on January 25, 2024 11:48 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…