అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితంలో సీతారామయ్య గారి మనవరాలులో ఏఎన్ఆర్ భార్యగా చేసిన నటిగా చెబితే గుర్తుకు రావడం కష్టం కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్ మహేష్ బాబుల బామ్మ అంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. ఆవిడే రోహిణి హట్టంగడి. తరచుగా కనిపించడం తప్ప సినిమాలు చేయడం బాగా తగ్గించిన ఈ పెద్దావిడ కొన్ని నెలల క్రితం ‘బైపన్ భారీదేవ’ అనే మరాఠి సినిమాలో కీలక పాత్ర పోషించారు. కేవలం 5 కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాప్రే అనిపించింది. ఆరు నెలల తర్వాత కానీ హాట్ స్టార్ ద్వారా ఓటిటి మోక్షం దక్కలేదు.
ఆరుగురు ఆడవాళ్ళ పాత్రలను తీసుకుని ఆరు రంగులను ప్రతిబింబించేలా, కేవలం ఎమోషన్స్ ని కదిలించేలా దర్శకుడు కేదార్ షిండే చేసిన ప్రయత్నం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఇందులో ఎలాంటి ఫైట్లు, కమర్షియల్ మసాలాలు ఉండవు. అచ్చం ఇంట్లో మాట్లాడుకున్నట్టే సన్నివేశాలు జరుగుతాయి. రోజూ చూసే పాత్రలను స్క్రీన్ మీద కలుస్తున్నట్టు ఉంటుంది. రోహిణి హట్టంగడికి తోడు మిగిలిన అయిదుగురు ఆర్టిస్టులు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడటంతో జనాలు థియేటర్లకు పోటెత్తారు. ఒరిజినల్ వెర్షన్ తో పాటు కేవలం హిందీ డబ్బింగ్ మాత్రమే అందుబాటులో ఉంచారు.
దీని ప్రస్తావన ఎందుకంటే తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. రోహిణి హట్టంగడినే కొనసాగించి మిగిలిన క్యాస్టింగ్ ని ఇక్కడి వాళ్ళను తీసుకునేలా ఒక మహిళా దర్శకురాలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. హక్కుల కోసం డిమాండ్ ఉండటంతో బైపన్ భారీదేవా నిర్మాతలు ఇతర బాషలకు అనువదించలేదని టాక్. అయినా స్టార్ హీరోల సినిమాలకే బ్లాక్ బస్టర్ లేని రోజుల్లో కేవలం ఆడవాళ్లను పెట్టుకుని ఇంత హిట్టు కొట్టడం విశేషమే. అంతగా ఏముందో తెలియాలంటే హిందీ మరాఠి రాకపోతే సబ్ టైటిల్స్ చూడటం తప్ప ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on January 25, 2024 4:37 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…