టాలీవుడ్ లో పోటీ తాకిడి స్ట్రెయిట్ సినిమాలకే కాదు డబ్బింగ్ చిత్రాలకూ తాకుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ తెలుగు వెర్షన్ ఈ రోజు విడుదల కావాలి. ఆ మేరకు గతం వారం ట్రైలర్ లోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ మలయాళంలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ యాక్టర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీగా దీని మీద భారీ అంచనాలున్నాయి. కేరళలో బాహుబలి రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా. విజువల్స్ చూస్తే కంటెంట్ కూడా దానికి తగ్గట్టే ఆ రేంజ్ లో కనిపిస్తోంది.
ఇక్కడ వెనుకడుగు వేయడానికి కారణాలున్నాయి. రేపు ఒకేసారి కెప్టెన్ మిల్లర్, అయలాన్ లు వస్తున్నాయి. లేట్ రిలీజ్ అయినప్పటికీ బలమైన డిస్ట్రిబ్యూటర్లు అండగా నిలవడంతో ఏపీ తెలంగాణలో తగినన్ని స్క్రీన్లు దొరికాయి. ఇవి కాకుండా హృతిక్ రోషన్ ఫైటర్ కి గ్రాండ్ మల్టీప్లెక్స్ రిలీజ్ దొరికింది. హనుమాన్ ఇంకా నెమ్మదించలేదు సరికదా రిపబ్లిక్ డే నుంచి మళ్ళీ పికప్ కానుంది. నా సామిరంగ, గుంటూరు కారంకు మెయిన్ థియేటర్లు మూడో వారంలోనూ కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మలైకోట్టై వాలిబన్ కి గ్యాప్ లేదు. పైగా ప్రమోషన్లకు సరిపడా టైం లేకపోవడం ఇంకో సమస్య.
ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సమస్య లేదు. తెలుగులో ఆలస్యమైనా జనాలు చూస్తారు. కాకపోతే మోహన్ లాల్ కు మన దగ్గర సోలో మార్కెట్ ఎప్పుడూ లేదు. జనతా గ్యారేజ్ లాంటి వాటిలో కీలక పాత్ర పోషించినా తమిళ హీరోల రేంజ్ లో ఆయన్ను సొంతం చేసుకోలేకపోయాం. అందుకే రిస్క్ ఎందుకులెమ్మని ప్రస్తుతానికి డ్రాప్ అయ్యారు. ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తప్ప చెప్పుకోదగ్గ కొత్త బొమ్మలేవీ లేకపోవడంతో ఆ తేదీని పరిశీలిస్తున్నారు. మలైకోట్టై వాలిబన్ పేరు కూడా కనెక్ట్ కాలేని విధంగా ఉంది. మన జనాలకు అర్థమయ్యేలా టైటిల్ పెడితే తప్ప బజ్ రాదు.
This post was last modified on January 25, 2024 9:46 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…