మంచి డేట్ కోసం విడుదల తేదీలు ముందే ప్రకటించుకోవడం వరకు బాగానే ఉంది వాటిని చేరుకోవడం మాత్రం ప్యాన్ ఇండియా సినిమాలకు ప్రాణ సంకటంగా మారుతోంది. కారణాలు ఏమైనా సరే దీని ప్రభావం మిగిలిన వాటి మీద తీవ్రంగా పడుతోంది. మరీ వెనక్కు అవసరం లేదు కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తే చాలు మ్యాటర్ అర్థమైపోతుంది. సెప్టెంబర్ నుంచి సలార్ డిసెంబర్ కు వెళ్లిపోవడం వల్ల కనీసం పదికి పైగా సినిమాలకు మార్కెట్, ఓపెనింగ్స్ పరంగా పెద్ద దెబ్బ కొట్టింది. దీని వల్ల క్రిస్మస్ నుంచి సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ పోటీలో నలిగిపోయి డిజాస్టర్ అందుకున్నారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర వాయిదా గురించి చర్చ జరుగుతోంది. యూనిట్ అఫీషియల్ గా చెప్పకపోయినా ఏప్రిల్ లో రాదనేది ట్రేడ్ లో బలంగా వినిపిస్తున్న మాట. ఆగస్ట్ 15 లాక్ చేసుకున్న పుష్ప 2 ది రూల్ సైతం తప్పుకోక తప్పదనే ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. మే తొమ్మిది కల్కి రావడం మీద అనుమానాలు తీరలేదు. గేమ్ ఛేంజర్ గురించి అప్డేట్ అంటే చాలు నిర్మాత దిల్ రాజు అక్కడి నుంచి మాయం కావడం ఒక్కటే తక్కువ. పవన్ కళ్యాణ్ ఓజి తిరిగి ఎప్పుడు మొదలవుతుందో ఎన్నికలు అయిపోతే కానీ చెప్పలేని పరిస్థితి. నిఖిల్ విశ్వంభు సైతం దసరా లేదా దీపావళిని చేరుకోవడానికి కష్టపడుతోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ ఎంత ప్లానింగ్ తో షూటింగులు చేస్తున్నా సరే వాయిదా పర్వానికి అందరూ బలవుతున్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి, సాహోలు సైతం గతంలో ఈ సమస్యను ఎదురుకున్నవే. దీనికి పరిష్కారం లేదా అంటే అంత సులభంగా ఎవరూ చెప్పలేరు. హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలలాగా మనకు అపరిమిత బడ్జెట్ లు, బోలెడు విఎఫెక్స్ వనరులు అందుబాటులో ఉండవు. ప్రతిదానికి పరుగులు పెట్టాల్సిందే. టాలీవుడ్ రేంజ్ పెరగడం వల్ల దర్శకులు రాజీ పడకుండా క్వాలిటీ కోసం పరితపిస్తున్నారు. అందుకే వాయిదాలు, ఆలస్యాలు అలవాటు చేసుకోవాల్సిందే
This post was last modified on January 24, 2024 2:58 pm
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…
సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే…
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…