వరుణ్ తేజ్ భార్యగా మెగా ఇంట్లో అడుగు పెట్టాక లావణ్య త్రిపాఠి తెరమీద కనిపించలేదు. ఎంగేజ్ మెంట్ తో మొదలుపెట్టి మొన్నటి సంక్రాంతి సంబరాల దాకా ఫ్యామిలీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న మెగా కోడలు త్వరలో వెబ్ సిరీస్ తో పలకరించబోతోంది. అదే మిస్ పర్ఫెక్ట్. బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించిన ఈ ఎంటర్ టైనర్ ఫిబ్రవరి 2 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. కథేంటో చెబుతూనే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయో దర్శకుడు విశ్వక్ ఖండేరావు వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
ఖరీదైన అపార్ట్ మెంట్ లో కొత్తగా తీసుకున్న ఫ్లాట్ లో చేరుతుంది లావణ్య(లావణ్య త్రిపాఠి). స్కూల్ వయసు నుంచి టాపర్ గా మిస్ పర్ఫెక్ట్ గా పేరున్న ఈ అమ్మాయికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఏది చిందరవందరగా కనిపించినా ఒప్పుకోదు. క్షణాల్లో సర్దేస్తుంది. నీట్ గా ఉండటమంటే ప్రాణం. అలాంటి లావణ్యకు ఎదురుగా వేరే అపార్ట్ మెంట్ లో ఉండే కుర్రాడి(అభిజీత్) ఇంటికి లక్ష్మి పేరుతో పని మనిషిగా చేరే పరిస్థితి వస్తుంది. వేషం మార్చుకుని నీట్ నెస్ తెలియని అతన్ని సంస్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇంతకీ లావణ్య లక్ష్మిలా ఎందుకు మారాల్సి వచ్చిందనేది స్టోరీ
కాన్సెప్ట్ సింపుల్ గా అనిపించినా ఎంటర్ టైన్మెంట్ మీద ఆధారపడ్డారు విశ్వక్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో మిస్ పర్ఫెక్ట్ రూపొందింది. ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తున్నాడు. పాయింట్ కొంచెం శర్వానంద్ మహానుభావుడుకి దగ్గరగా అనిపించినా ఇది వేరే ట్రీట్ మెంట్ తో అల్లుకున్నారు. థియేటర్ కంటెంట్ కాదు కాబట్టి నిక్షేపంగా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడానికి సరిపడా విషయమైతే ఉన్నట్టు అనిపిస్తోంది. ఫిబ్రవరి 2 చిన్న బడ్జెట్ సినిమాలు తప్ప భారీ రిలీజులు ఏవీ లేకపోవడం ఈ మిస్ పర్ఫెక్ట్ కి కలిసి వచ్చేలా ఉంది.
This post was last modified on January 23, 2024 2:34 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…