రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ సరసన చోటు దక్కించుకునేందుకు పరుగులు పెడుతున్న హనుమాన్ సీక్వెల్ వచ్చే ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జై హనుమాన్ టైటిల్ థియేటర్లోనే రివీల్ చేశారు. సినిమా సాధించిన ఘనవిజయం చూసి ఒక్కసారిగా కొనసాగింపుపై అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమంతుడి పాత్ర కోసం పెద్ద హీరోని ట్రై చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెబుతున్నాడు. తేజ సజ్జ ఉన్నప్పటికీ ప్రాధాన్యం పరంగా మొత్తం కథ అసలు హనుమాన్ చుట్టే తిరుగుతుందట.
అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ పెట్టుకున్న ఆప్షన్లలో బయట ప్రచారం జరిగినట్టు చిరంజీవి లేరు. ఎందుకంటే విశ్వంభర తప్ప ఇంకో ఏడాది దాకా వేరే ఏ చిత్రంలో నటించే ఆలోచన మెగాస్టార్ పెట్టుకోలేదు. సో నో ఛాన్స్. తనకు డైరెక్టర్ గా అవకాశమిచ్చిన నానిని ఈ విషయంగా సంప్రదించినట్టు వినికిడి. అయితే సానుకూలంగా స్పందించింది లేనిది ఇంకా తెలియలేదు. ఆంజనేయుడిగా తన శరీరం సూటవుతుందా లేదానే దాని మీద సందేహం వ్యక్త పరిచినట్టు టాక్. బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ వేరే సబ్జెక్టు ప్లాన్ చేసుకున్నాడు. అడిగే ఛాన్స్ లేనట్టే.
స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు హనుమంతుడిగా నటించడం ఓకే కానీ దానికి తగ్గ విగ్రహం, కండలు చాలా ముఖ్యం. ప్రశాంత్ వర్మ ఇంకా స్క్రిప్ట్ ని పూర్తి చేయాల్సి ఉంది. బడ్జెట్ మీద ఒక అవగాహనకు వచ్చాక ఆర్టిస్టులు ఎవరనేది డిసైడ్ చేయాలి. తేజ సజ్జ సంగతి పక్కనపెడితే వచ్చే ఏడాది జై హనుమాన్ రిలీజ్ చేయాలంటే కేవలం సంవత్సర కాలం సరిపోకపోవచ్చు. పైగా ప్రశాంత్ వర్మ ఆల్రెడీ నిర్మాణంలో అధీరాని పూర్తి చేయాలి. దానికన్నా ముందు సైలెంట్ గా తీసిన రామ్ కామ్ ఎంటర్ టైనర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవాలి. జై హనుమాన్ ఆలస్యమయ్యేలానే ఉంది. క్వాలిటీ ముఖ్యంగా కదా.
This post was last modified on January 23, 2024 6:44 am
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…