ఈ ఏడాది తెలుగు అనే కాక మొత్తంగా పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో దేవర ఒకటి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడం.. ఈ సినిమాకు సంబంధించి అన్ని భారీగా కనిపిస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
షూటింగ్ మొదలవడానికి ముందే దేవారం రిలీజ్ డేట్ ఇచ్చేసింది చిత్ర బృందం. దాని ప్రకారం ఏప్రిల్ 5న సినిమా విడుదల కావాల్సి ఉంది. అంటే అటు ఇటుగా సినిమా విడుదలకు 70 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి సమయంలో దేవర రిలీజ్ డేట్ మారుతుంది అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అందుకు కారణం విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యమే అంటున్నారు.
ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అని టీంను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. సినిమాకు సంబంధించిన పనుల్లో ఆలస్యం ఏమీ లేదని చెబుతున్నారు. దేవరలో విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడ్డ సన్నివేశాలను చాలా ముందుగానే చిత్రీకరించి.. వాటికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను సమాంతరంగా చేయిస్తున్నారని.. ఆ కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.
దేవర రిలీజ్ డేట్ మారితే అది వేరే కారణం వల్లే జరుగుతుందని చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ ప్రథమార్ధంలో జరిగే సంకేతాలు కనిపిస్తుండడంతో.. దేవర విడుదలను కొంచెం ముందుకు లేదా వెనక్కి జరిపే అవకాశం ఉందని సమాచారం. అంతే తప్ప షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం ఏమీ లేదని.. అభిమానులు ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన పనిలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on January 22, 2024 10:25 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…