హనుమాన్ సినిమా విడుదలై వారం రోజులు దాటిపోయినా.. ఊపేమి తగ్గట్లేదు. రెండో వారంలో కూడా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తోంది. ఈ వీకెండ్లో హనుమాన్ ముందు ఏ సినిమా కూడా నిలవలేకపోతోంది. ఈ వారమే వచ్చిన కొత్త సినిమాలా ఆ చిత్రం హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ హనుమాన్ టికెట్లు దొరకడం గగనంగానే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ బ్రేకింగ్ అయి లాభాల పంట పండిస్తున్న హనుమాన్.. వసుళ్ల పరంగా పెద్ద పెద్ద టార్గెట్ల వైపు అడుగులేస్తోంది. ఓవరాల్ వసూళ్లు 200 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉన్నాయి.
వసూళ్ళ పరంగా హనుమాన్ సంచలనాలు మిగతా చోటల్లా ఒక ఎత్తు అంటే అమెరికాలో మరో ఎత్తు. చిన్న సినిమాలకు అక్కడ మిలియన్ డాలర్లు అంటేనే పెద్ద విషయం. ఈ సినిమా ఏకంగా 4 మిలియన్ మార్కును దాటేసింది. దీంతో నాన్-రాజమౌళి, నాన్- ప్రభాస్ రికార్డు ఆ సినిమా సొంతం అయిపోయింది. ఇప్పటిదాకా అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో 3.8 మిలియన్ డాలర్లతో నాన్-రాజమౌళి, నాన్- ప్రభాస్ రికార్డును హోల్డ్ చేసింది.
ఇప్పుడు హనుమాన్ 4 మిలియన్ మార్కును అందుకొని ఐదు మిలియన్ డాలర్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. ఆ ఘనత కూడా హనుమాన్ సొంతం కావడం కష్టమేమీ కాదు. అదే జరిగితే ఇకపై ప్రతి టాలీవుడ్ స్టార్ హీరో యుఎస్ టార్గెట్ 5 మిలియన్ అవుతుంది. నాలుగు మిలియన్ల మార్కును అందుకోవడమే కష్టంగా ఉంటే.. ఐదు మిలియన్లు అంటే ఆషామాషీ విషయం కాదు.
This post was last modified on January 21, 2024 10:22 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…