హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా.. ఇలా అనేక రకాల పాత్రల్లో మెప్పించిన నటుడు శివాజీ. దాదాపు రెండు దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన అతను.. కొన్నేళ్ల నుంచి వెండి తెర మీద పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఆపై వాటికీ దూరం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని నెలల కిందట బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడు.
ఇటీవలే విడుదలైన శివాజీ వెబ్ సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా త్వరలోనే శివాజీ వెండితెర మీదికి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు విశేషం. అంతకంటే విశేషం ఏంటంటే అతను విలన్ పాత్రతో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా కన్ఫమ్ చేశాడు. కాకపోతే ఏ సినిమాలో అన్నది మాత్రం చెప్పలేదు.
అయితే శివాజీ సన్నిహితుల సమాచారం ప్రకారం అతను బోయపాటి చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నాడట. బోయపాటి తన తర్వాతి చిత్రాన్ని తన ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే ఒక టీవీ షోలో శివాజీ మాట్లాడుతూ తాను బోయపాటి సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడేమో విలన్ పాత్ర గురించి అప్డేట్ ఇచ్చాడు. కాబట్టి బాలయ్య- బోయపాటి సినిమాలో శివాజీని ప్రతినాయకుడి పాత్రలో చూడొచ్చు అన్నమాట.
హీరోగా ఉన్న రోజుల్లోనే ఒట్టేసి చెబుతున్నా సహా కొన్ని చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు శివాజీ. వాటిలో పెర్ఫార్మన్స్ బట్టి చూస్తే విలనీని అతను బాగానే పండిస్తాడని భావించవచ్చు. బిగ్ బాస్ షో నుంచి వచ్చాక తను చాలా కథలు విన్నానని.. వాటిలో చాలావరకు రొటీన్ గా ఉన్నాయి అని శివాజీ చెప్పాడు. విలన్ పాత్ర ఒకటి వైవిధ్యంగా అనిపించి ఆ సినిమా ఒప్పుకున్నట్లు శివాజీ తెలిపాడు.
This post was last modified on January 20, 2024 10:06 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…