బాక్సాఫీస్ వద్ద హనుమాన్ తాకిడి ఆగే సూచనలు కనిపించడం లేదు. సంక్రాంతి సెలవులు అయ్యాక బాగా నెమ్మదిస్తుందనుకుంటే దానికి భిన్నంగా వీక్ డేస్ లోనూ హౌస్ ఫుల్స్ రిజిస్టర్ చేయడం ట్రేడ్ ని షాక్ గురి చేస్తోంది. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ ని అఫీషియల్ గా దాటేసిన హనుమాన్ ఫైనల్ రన్ అయ్యేలోపు నమోదు చేయబోయే ఫిగర్లు వణుకు పుట్టించేలా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 300 కోట్లకు పైగానే వస్తుందని, నార్త్ లో క్రమంగా ఊపందుకోవడం దానికి సూచనగా చెబుతున్నారు. ఓవర్సీస్ లో రంగస్థలం, అల వైకుంఠపురములోని దాటేసింది.
థియేటర్లు, షోలు హనుమాన్ కి ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నారు. మొన్నటిదాకా జిల్లా కేంద్రాల్లో ఇరవై లోపే ఉన్న షోలు ఇప్పుడు ఏకంగా నలభైకి దగ్గరగా వెళ్తున్నాయి. ఇంకోవైపు గుంటూరు కారం కౌంట్ గణనీయంగా తగ్గిపోతోంది. వారాంతంలో మినహాయించి ఇంకెలాంటి మేజిక్ జరగకపోవచ్చని బయ్యర్ల టాక్. దీని సంగతలా ఉంచితే హనుమాన్ శని ఆదివారాల్లో నమోదు చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాంకే. ముఖ్యంగా హైదరాబాద్ లో నేరుగా కౌంటర్ దగ్గర టికెట్లు కొనే పరిస్థితి ఎంత మాత్రం లేదు. మొత్తం ఆన్ లైన్ లోనే గంటల ముందు ఫుల్ అవుతున్నాయి.
దీనికి తోడు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశమంతా ఒకరకమైన ఆధ్యాత్మిక చింతన నెలకొంది. సినిమాల మీద ఆసక్తి ఉన్న జనాలు హనుమాన్ చూసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా విడుదలకు ముందే ఊహించిన ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ ఆనందం మాములుగా లేదు. నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ కు కేవలం ఓవర్సీస్ నుంచే పదిహేను కోట్లకు పైగా లాభం రావొచ్చని అంచనా. బాహబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానంలో సలార్ పెట్టిన 8 మిలియన్ టార్గెట్ అందుకోవాలని హనుమాన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏమో జరగవచ్చేమో.
This post was last modified on January 20, 2024 2:56 pm
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…