తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోనూ అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమాకు బాలీవుడ్ క్రిటిక్స్ చాలా మంది నెగిటివ్ రివ్యూలే ఇవ్వగా.. వాళ్లందరి మీద సందీప్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. సందర్భం వచ్చినప్పుడల్లా క్రిటిక్స్ ను ఏకపడేశాడు. తన లేటెస్ట్ మూవీ యానిమల్ రిలీజ్ అయ్యాక కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాను విమర్శించిన బాలీవుడ్ క్రిటిక్స్ కు.. ఇంటర్వ్యూలలో గట్టి కౌంటర్లు ఇచ్చాడు సందీప్.
తాజాగా మరోసారి బాలీవుడ్ క్రిటిక్స్ ను ఘాటుగా విమర్శించాడు సందీప్. బాలీవుడ్ లో చాలామంది దర్శకుల దగ్గర డబ్బులు తీసుకుని పెయిడ్ రివ్యూలు రాస్తుంటారని.. అలాగే వేరే వాళ్ళ సినిమాలను టార్గెట్ చేస్తుంటారని అన్న సందీప్.. యానిమల్ మూవీని కూడా ఇలాగే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించాడు. ఈ సినిమాను మూడు గంటలు టార్చర్ గా అభివర్ణించడం అన్యాయం అని.. ఇలా పేర్కొన్న వాళ్ళు ఎవరు ఈ సినిమా సాధించిన ఓపెనింగ్స్ గురించి.. తమ కష్టం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
యానిమల్ గురించి నెగిటివ్ గా రాసిన, మాట్లాడిన ఎవరికీ సినిమా గురించి అసలు ఏమీ తెలియదని సందీప్ వ్యాఖ్యానించాడు. ఇక బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువే అని.. తమ వాళ్ళ సినిమాలనే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటారని.. అడ్డం వచ్చిన వాళ్ళతో క్రూరంగా వ్యవహరిస్తారని సందీప్ ఆరోపించాడు. బాలీవుడ్లో వివక్ష ఎలా ఉంటుందో అవార్డుల వేడుకల్లో చాలాసార్లు చూశానని.. దాని గురించి మాట్లాడాలంటే రెండు రోజులు పడుతుందని.. కానీ తాను ఈ విషయాల గురించి చిన్న పిల్లాడిలా ఏడవాలనునుకోవడం లేదని సందీప్ అన్నాడు.
This post was last modified on January 20, 2024 8:53 am
ఏపీలో విపక్షం వైసీపీకి హార్డ్ కోర్ అభిమానిగానే కాకుండా ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా కొనసాగుతున్న ఇప్పాల రవీంద్రా…
ఏ సినిమా గురించైనా వాటి నిర్మాతలు బాగుంటుంది అదిరిపోతుంది చూడమని చెప్పడం సహజం. కానీ మైత్రి రవిశంకర్ ఒక అడుగు…
హైదరాబాద్ క్రికెట్ అభిమానుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ మంచి వార్త అందించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో…
ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ భూతంగా మారుతున్న ఈ రోజుల్లో, కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త చిచ్చు తెరమీదికి వచ్చింది. త్వరలోనే మంత్రి వర్గాన్ని విస్తరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం…
తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కలకలం కొనసాగుతూనే ఉంది. యువతను ఫైనాన్స్ దోపిడీ దిశగా నెట్టేసిన ఈ యాప్స్ కారణంగా…