సంక్రాంతి సినిమాల ప్రతి విషయంలో ఎక్కువ కేంద్ర బిందువుగా నిలిచిన గుంటూరు కారం మొదటి వారం పూర్తి చేసుకుంది. 212 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సెలవులు పూర్తయి వీక్ డేస్ లో నెమ్మదించడం కనిపిస్తోంది కానీ ఈలోగానే బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో ఉన్నామని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన కొన్ని కబుర్లు పంచుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారని, మహేష్ కెరీర్ లో ఇంత పెద్ద హిట్ ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకొచ్చాయి.
సలార్ లాంటి మాస్ మూవీకి అర్ధరాత్రి ప్రీమియర్లు వేయడం ప్లస్ అయ్యిందని, కానీ త్రివిక్రమ్ తీసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి ఆ పద్ధతి సూట్ కాదని గుర్తించకపోవడం వల్లే సోషల్ మీడియాలో కొంత మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పిన నాగవంశీ రివ్యూలు, టాకులు ఎలాంటి ప్రభావం చూపించలేదని అంటున్నారు. ఒక మీడియా వర్గం అదే పనిగా టార్గెట్ చేసి, డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మరీ కలెక్షన్లు కనుక్కునే దాకా వచ్చారని, కానీ ఎవరెన్ని చేసినా ఫైనల్ గా మంచి విజయం దక్కిందని అన్నారు. నేరుగా ఎవరి గురించో ప్రస్తావన తేలేదు కానీ చురకలు ఎవరికో అన్నట్టు క్లూస్ ఇచ్చినట్టే ఉంది.
మాట్లాడినంత సేపూ హనుమాన్ ఆధిపత్యం తదతర విషయాల ప్రస్తావన రాకుండా కేవలం గుంటూరు కారం గురించే మాట్లాడారు నాగవంశీ. ఈగల్ కోసం టిల్లు స్క్వేర్ వాయిదా వేశాక జరిగిన పరిణామాలు తనకు తెలియదని, ఫిబ్రవరి 9 సోలో రిలీజ్ రాకపోవడం గురించి ఎదురైన ప్రశ్నను దాటవేశారు. ఇదంతా ఎలా ఉన్నా క్షేత్ర స్తాయిలో గుంటూరు కారం స్క్రీన్లు తగ్గిపోయి హనుమాన్ కి పెరిగిన విషయం దాచేది కాదు. తమ సినిమా బ్లాక్ బస్టరని చెబుతున్న నాగవంశీ మాటల ప్రకారం భారీ లాభాలు అందుకుంటే అభిమానులకే కాదు బయ్యర్లకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on January 19, 2024 5:33 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…