అనుకున్నట్టే ఫిబ్రవరి 9 ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారబోతోంది. సంక్రాంతి సినిమాల విడుదల టైంలో ఎక్కువ పోటీ ఉండటం వల్ల పరస్పర ప్రయోజనాలు దెబ్బ తింటాయని, దాని కోసం ఈగల్ ని వాయిదా వేసుకుంటే తర్వాత సోలో రిలీజ్ డేట్ వచ్చేలా చూస్తామని సదరు ప్రొడ్యూసర్ కి నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా ఒక్కో కొత్త సినిమా అదే డేట్ కి వస్తున్నామని పోస్టర్లు, ట్రైలర్లు వదులుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమకిచ్చిన మాట నిలబెట్టుకోమంటూ ఈగల్ తరఫున పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లేఖ రాసింది.
ఫిబ్రవరి 8న యాత్ర 2 రాబోతోంది. యువి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామి కావడంతో మంచి రిలీజ్ దక్కుతుంది. జగన్ బయోపిక్ గా దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరుసటి రోజు ఊరి పేరు భైరవకోన మీద అంచనాలు పెరుగుతున్నాయి. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ పండగ టైంలో తమను ఎవరూ పోస్ట్ పోన్ గురించి సంప్రదించలేదని, ఇప్పుడు నిర్ణయం మార్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పిన సంగతి తెలిసిందే. వీటికి తోడు రజనీకాంత్ పేరు మీద మార్కెట్ చేస్తున్న లాల్ సలామ్ అదే రోజు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఈగల్ నిర్మాతల విన్నపం లేదా డిమాండ్ పేరు ఏదైనా సబబుగానే అనిపిస్తోంది. ఆ రోజు టిల్లు స్క్వేర్ వాయిదాకి ఒప్పించామని దిల్ రాజుతో సహా పలువురు పెద్దలు నొక్కి వక్కాణించారు కానీ యాత్ర 2, ఊరు పేరు భైరవకోనలు ఉన్న విషయాన్ని మర్చిపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇప్పుడీ లెటర్ కి ఫిలిం ఛాంబర్ ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంకో తేదీకి వెళ్లే ఛాన్స్ లేనట్టే. పోనీ మిగిలినవాళ్లను ఒప్పిస్తారా అంటే అదంత సులభం కాదు. ఇంటర్వెల్ ట్విస్టు లాగా ఈ సంఘటనలు ఆసక్తికరంగా మారుతున్నాయి. క్లైమాక్స్ ఏమవుతుందో.
This post was last modified on January 19, 2024 12:02 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…