సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామన్న నిర్మాతల మండలి హామీ మేరకు పండగ బరి తప్పుకుంది ఈగల్ సినిమా. కానీ ఈ ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే తమ సినిమాను ఈగల్ కొత్త రిలీజ్ డేట్ అయిన ఫిబ్రవరి 9నే రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది ఊరి పేరు భైరవకోన టీం. మరోసారి రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ పోస్టర్ వదిలారు. ఇప్పుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. తమ సినిమా ఫిబ్రవరి 9న పక్కాగా రాబోతున్నట్లు మరోసారి చిత్ర బృందం ధ్రువీకరించింది. ఇంకో వైపు చూస్తే యాత్ర- 2, లాల్ సలాం చిత్రాలు కూడా అదే డేట్ కు రాబోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఈగల్ సినిమాకు ఇబ్బందులు తప్పేలా లేవు. తమ సినిమా అవుట్ పుట్ విషయంలో ఈగల్ టీం కాన్ఫిడెంట్ గానే ఉంది కానీ.. పోటీలో ఉన్న సినిమాలను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో మిస్టరీ థ్రిల్లర్లు చాలా బాగా ఆడుతున్నాయి. కాంతార, విరూపాక్ష, మా ఊరి పొలిమేర-2 లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఊరి పేరు భైరవకోన కూడా వాటిలాగే ప్రామిసింగ్ సినిమాలా కనిపిస్తోంది. దాని ట్రైలర్ చాలా ఇంప్రెస్సివ్ గా అనిపించింది.
మరోవైపు వైయస్ జగన్ బయోపిక్ యాత్ర-2కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక జైలర్ తర్వాత వస్తున్న రజిని సినిమా లాల్ సలాంకు కూడా క్రేజ్ ఉంది. మరి క్రేజీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని అన్ సీజన్లో ఇంత పోటీ మధ్య వస్తున్న ఈగల్ చిత్రం ఏమేర నెట్టుకు వస్తుందో చూడాలి.
This post was last modified on January 19, 2024 11:57 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…