గత కొంత కాలంగా తనదంటూ ముద్ర చూపించలేక దేవిశ్రీ ప్రసాద్ బాగా వెనుకబడ్డాడు. పుష్ప 1 ది రైజ్ ఇచ్చిన సక్సెస్ నిలబెట్టుకోలేక వరస ఫ్లాపులు పలకరించాయి. రౌడీ బాయ్స్, ఖిలాడీ, ఆడాళ్ళు మీకు జోహార్లు, ది వారియర్, రంగ రంగ వైభవంగా అన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టరయ్యాయి. కంటెంట్ సంగతి పక్కనపెడితే మ్యూజికల్ గా ఒకటి రెండు పాటలు క్లిక్ అవ్వడం తప్ప ఏవీ దేవి స్థాయిలో లేవనేది వాస్తవం. ఒక్క వాల్తేరు వీరయ్య మాత్రమే అంచనాలకు మించి ఆడింది. దానికిచ్చిన సాంగ్స్, బీజీఎమ్ రెండూ మునుపటి రేంజ్ లో కాకపోయినా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.
దాని తర్వాత గ్యాప్ తీసుకున్న దేవి ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తన చేతిలో క్రేజీ ప్రాజెక్టులు వచ్చి పడుతున్నాయి. ‘పుష్ప 2 ది రూల్’ మీద మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎప్పుడు తిరిగి మొదలైనా పవన్ కళ్యాణ్ కోసం దేవి ఇచ్చే ట్యూన్లు ఫ్యాన్స్ కి ఊపొచ్చేలా ఉంటాయని దర్శకుడు హరీష్ శంకర్ భరోసా ఇస్తున్నాడు. నాగ చైతన్య ‘తండేల్’ కు ముందు అనిరుద్ కోసం ట్రై చేసి తిరిగి దేవి కన్నా బెస్ట్ ఆప్షన్ లేదని తనకే ఫిక్సయ్యారు. తాజాగా ‘ధనుష్ – నాగార్జున -శేఖర్ కమ్ముల’ ప్యాన్ ఇండియా మూవీ తన ఖాతాలోకి వచ్చి చేరింది.
తమన్, హేశం అబ్దుల్ వహాబ్ లతో పాటు తమిళ బ్యాచ్ సంతోష్ నారాయణన్, జివి ప్రకాష్ కుమార్, జిబ్రాన్ తదితరులతో కాంపిటీషన్ చాలా టైట్ గా ఉంది. మణిశర్మ సైతం అంచనాలు అందుకోలేక వెనుకబడుతున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి మళ్ళీ కీరవాణి హవా కనిపిస్తోంది. రెహమాన్, ఇళయరాజాల ముద్ర మన దగ్గరేం పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో దేవి కనక సరైన ఛార్ట్ బస్టర్స్ అందుకుంటే తిరిగి ఫామ్ లోకి వచ్చేయొచ్చు. వింటేజ్ దేవిని చూడాలని తహతహలాడుతున్న మ్యూజిక్ లవర్స్ కోరిక తీరాలంటే చేతిలో ఉన్న అవకాశాలను సరిగా వాడుకుంటే సరి. సిక్సర్ కొట్టినట్టే.
This post was last modified on January 18, 2024 7:04 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…