Movie News

తేజ సజ్జ ముందు సవాళ్ల వలయం

ఇప్పటికీ కొందరు స్టార్ హీరోలకు అందని ద్రాక్షగా మిగిలిన వసూళ్లను మంచి నీళ్లు తగినంత తేలిగ్గా సాధిస్తున్న హనుమాన్ హీరోగా తేజ సజ్జ ఇమేజ్ ఒకేసారి పది మెట్లు ఎక్కేసింది. సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో హనుమంతుడి ఎలిమెంట్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన పాత్ర పోషించినప్పటికీ తేజకు వచ్చిన గుర్తింపు చిన్నదేమీ కాదు. ఇప్పుడు నిర్మాతలు వెంటపడుతున్నారు. నాన్ స్టాప్ గా కాల్స్ చేస్తున్నారు. డేట్లు ఇస్తే కథ దర్శకుడు తర్వాత చూసుకుందామని అడ్వాన్స్ చెక్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఆల్రెడీ తను మంచు మనోజ్-దుల్కర్ సల్మాన్ తో ‘మిరాయ్’ అనే మూవీ చేస్తున్నాడు.

ఇకపై అసలు సవాల్ ఎదురుకానుంది. అదే కథల ఎంపిక. క్రేజీ కాంబోల ఉచ్చులో పడి డైరెక్టర్ల బ్రాండ్ ని గుడ్డిగా నమ్మితే ఎలాంటి సమస్యలు వస్తాయో చరిత్ర చాలా సార్లు ఋజువు చేసింది. భక్తి ఫాంటసీలు చేయకపోయినా ఒకప్పుడు తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి వాళ్ళు ఇంతే స్థాయిలో విజయాలు చవి చూశారు. ఓవర్ నైట్ స్టార్లయ్యారు. కానీ కెరీర్ ప్లానింగ్ లో చేసిన పొరపాట్లు తగిన మూల్యాన్ని చెల్లించేలా చేశాయి. ఒకప్పుడు యూత్ స్టార్ అవుతాడనుకున్న రాజ్ తరుణ్ సోలోగా అవకాశాలొస్తున్నా ప్రస్తుతం నా సామిరంగ లాంటి వాటిలో లెన్త్ తక్కువున్న పాత్రలకు ఓకే చెబుతున్నాడు.

తేజ సజ్జ ఎంత జాగ్రత్తగా ఉంటాడనేది భవిష్యత్తుని శాశిస్తుంది. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో తను ఎక్కువగా ఉండకపోవచ్చని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆల్రెడీ హింట్ ఇచ్చాడు. కాకపోతే భవిష్యత్తులో సినిమాటిక్ యునివర్స్ ని కలిపే క్రమంలో మళ్ళీ తేజ సజ్జని తీసుకుంటాడు. ఇద్దరి మధ్య జాంబీ రెడ్డి ముందు నుంచే స్నేహం ఉంది. వీళ్ళ సంగతి పక్కనపెడితే త్రినాధరావు నక్కినతో తేజ సజ్జ ఒక సినిమా ఒక చేశాడని ఇన్ సైడ్ టాక్. పెద్ద బడ్జెట్ తోనే ప్లాన్ చేశారట. ఈ రెండు కాకుండా తేజ సజ్జ ఖచ్చితంగా ఒప్పుకున్నవి ఏవి లేవు. హనుమాన్ హడావిడి అయ్యాక కథలు చెప్పేందుకు డైరెక్టర్ల క్యూ ఎదురుచూస్తోంది.

This post was last modified on January 18, 2024 11:28 am

Share

Recent Posts

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

2 minutes ago

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

1 hour ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

3 hours ago

జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…

3 hours ago

టికెట్ రేట్ల పంచాయితీలో ‘ప్యారడైజ్’ తర్జన భర్జన

ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…

4 hours ago

ప్రతీకారానికి ఒక్క నిమిషం చాలు.. కానీ నేను ఆ పని చేయలేదు

వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను…

4 hours ago