జస్టిస్ ఫర్ సుషాంత్ అంటూ పుట్టుకొచ్చిన ‘ఆర్మీ’ బాలీవుడ్‍లో ఎవరికీ నిద్ర వుండనివ్వడం లేదు. ఇప్పటికే సినిమా నటుల వారసులు, ఆ వారసులతో సినిమాలు తీసేవాళ్లు సోషల్ మీడియాకి దూరంగా వుంటున్నారు. ఇక వీళ్లతో ఆల్రెడీ సినిమాలు తీస్తోన్న వాళ్లు రేపు ఆ సినిమాలు రిలీజ్ అయినపుడు ఎక్కడ నెగెటివ్ ఫీడ్‍బ్యాక్ వస్తుందోనని హడలిపోతున్నారు. ఇంకా షూటింగ్ అయినా మొదలు కాని ప్రభాస్ ‘ఆది పురుష్’ చిత్రానికి కూడా ఈ సెగ తగిలేసింది.
ఇందులో విలన్‍గా, అంటే రావణుడిగా, ‘లంకేష్’ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు. సుషాంత్ సింగ్‍కి గతంలో సైఫ్ కూతురు సారా అలీ ఖాన్‍తో రిలేషన్ వుందని మీడియా ఇన్వెస్టిగేషన్‍లో తేలడంతో వాళ్లిద్దరూ విడిపోవడానికి సైఫ్ అలీ ఖాన్ కారణమని అతనిపై నిరసన వ్యక్తమవుతోంది. సరిగ్గా ఈ టైమ్‍లో అతను ‘ఆది పురుష్’లో నటిస్తున్నాడనే వార్త అధికారికంగా రావడంతో లంకేష్‍ని మార్చాలనే విన్నపాలు మిన్నంటుతున్నాయి. ఖాన్స్ కి ప్రత్యామ్నాయంగా ప్రభాస్‍ని కొందరు చూస్తున్నారు.
ఇప్పుడతని సినిమాలో ఒక ఖాన్ నటించడం వారికి నచ్చడం లేదు. మరికొందరు సైఫ్‍కి అసలు చరిత్ర గురించి ఏమి తెలుసని అతడీ పాత్ర పోషించడానికి అర్హుడంటూ వాదిస్తున్నారు. మరోవైపు తెలుగు మాస్ ఆడియన్స్ కి అతడెవరో తెలియదు కనుక అంత కీలకమైన పాత్ర అతనితో చేయిస్తే నేటివిటీ సమస్యలు తలెత్తుతాయని ప్రభాస్ అభిమానులు ఈ ఛాయిస్ పట్ల హ్యాపీగా లేరు.
This post was last modified on September 5, 2020 12:01 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…