సంక్రాంతి కోడిపుంజులన్నీ దిగిపోయాయి. విన్నర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది. హనుమాన్ కి బ్రహ్మరథం పడుతూ ప్రేక్షకులు తీర్పిచ్చారు. నిజానికీ నాలుగు సినిమాలతో పాటు ఈగల్ కూడా రావాల్సింది. కానీ రవితేజ పూనుకోవడంతో వాయిదా పడింది. అదెంత గొప్ప నిర్ణయమో కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు. నిజానికి జనవరి మొదటి వారం దాకా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్ థియేటర్లు తక్కువ దొరికినా సరే ఖచ్చితంగా విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారు. దానికి తగ్గట్టే కొత్త పోస్టర్లు ఎప్పటికప్పుడు వదులుతూనే వచ్చారు. నిర్మాత మండలి జోక్యంతో మనసు మార్చుకున్నారు.
కట్ చేస్తే పండక్కు ఎలాంటి సినిమాలకు ఆదరణ దక్కుతోందో వసూళ్లు తేల్చి చెప్పాయి. హనుమాన్ ని పక్కన పెడితే నా సామిరంగకు మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. నాగ్ గత మూడేళ్ళలో ఇంత పెద్ద నెంబర్లు చూడలేదన్నది నిజం. ఆయన నమ్మకాన్ని విజయ్ బిన్నీ నిలబెట్టాడు. ఇక గుంటూరు కారం టాక్ తో తనకేం పని లేదన్నట్టు ఫ్యామిలీస్ ని బాగానే లాగుతోంది. నిర్మాత సంస్థ నూటా ఇరవై కోట్లు వచ్చేశాయని చెప్పింది. గ్రౌండ్ లెవెల్ లో షోలు తగ్గిపోవడం దాచలేరు కానీ మెయిన్ సెంటర్స్ లో మాత్రం ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి. గురువారం నుంచి చూడాలి.
ఒకవేళ ఈగల్ కనక ఈ హడావిడిలో దిగి ఉంటే సైంధవ్ లాగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాని ప్రాధాన్యత క్రమంలో ఆడియన్స్ నాలుగో స్థానంలో పెట్టేశారు. టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. హౌస్ ఫుల్స్ పడుతున్న దాఖలాలు తక్కువగా ఉన్నాయి. సీరియస్ నెస్ ఎక్కువ ఉన్న సినిమా కావడంతో జనాలు కాస్త దూరంగానే ఉన్నారు. ఈగల్ బ్యాక్ డ్రాప్, స్టోరీ వేరే అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కాదు. సో చక్కగా తప్పుకుని ఫిబ్రవరికి వెళ్లడం వల్ల మాస్ మహారాజా తనకు తానే కాదు మిగిలిన వాళ్లకూ మేలే చేశాడు.
This post was last modified on January 15, 2024 9:53 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…