Movie News

20 ఏళ్ళ క్రితం కృష్ణవంశీ చేసిన పొరపాటు

క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న కృష్ణవంశీకి హనుమాన్ కి ఒక మర్చిపోలేని కనెక్షన్ ఉంది. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం 2004లో అయన శ్రీ ఆంజనేయం ఇచ్చారు. నితిన్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జని అంజనీ పుత్రుడి పాత్రలో భారీ బడ్జెట్ తో తీశారు. అంచనాలు మాములుగా ఏర్పడలేదు. ఓపెనింగ్స్ ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చాయి. పైగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం. పబ్లిసిటీ ఘనంగా చేశారు. కాంబో క్రేజ్ రావడానికి ఇంతకన్నా ఏం చేయాలి. విజువల్ ఎఫెక్ట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంతా చేసి శ్రీ ఆంజనేయం అంచనాలు అందుకోలేక ఫెయిల్యూరయ్యింది.

ఈ సినిమా వరకు కృష్ణవంశీ చేసిన ప్రధాన పొరపాటు మాస్ ఆడియన్స్ కోసమని హీరోయిన్ ఛార్మీతో అవసరానికి మించి గ్లామర్ షో చేయించడం, అతిగా మాట్లాడేలా క్యారెక్టర్ ని డిజైన్ చేసి కొంచెం ఓవరాక్షన్ చేయించడం. ఇది ప్రధానంగా ఫ్యామిలీ జనాలకు నచ్చలేదు. పూల గుమగుమ చేరని అంటూ ఘాటు రొమాంటిక్ సాంగ్ కూడా పెట్టారు. కానీ ఇప్పుడొచ్చిన హనుమాన్ చూస్తే దర్శకుడు ప్రశాంత్ వర్మ అసలు అలాంటి అంశాల జోలికే వెళ్ళలేదు. అమృతా అయ్యర్ కు పాటలున్నాయి కానీ అవి హుందాగా, సందర్భానికి తగ్గట్టు ఉంటాయి. అందుకే క్లీన్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా నిలుస్తోంది.

ఇప్పుడిది గుర్తు చేయడానికి కారణం హనుమాన్ సాధించిన ఘన విజయమే. ఒకవేళ ఆ టైంలో కృష్ణవంశీ కనక కేవలం సబ్జెక్టుకే కట్టుబడి ఉంటే మంచి ఫలితం వచ్చేది. శ్రీ ఆంజనేయం ఎప్పుడు చూసినా అందులో గ్రాఫిక్స్ ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని సీన్లు మంచి కిక్ ఇస్తాయి. అయినా సరే కష్టమంతా వృధా అయిపోయింది. ప్రస్తుతం రికార్డుల పని పట్టడమే టార్గెట్ గా పెట్టుకున్న హనుమాన్ ఇప్పట్లో నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. అనూహ్యంగా గుంటూరు కారం లాంటి గట్టి పోటీని తట్టుకుని మరీ విజేతగా నిలిచే దిశగా వెళ్లడం అనూహ్య పరిమాణం. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం జేబులో వేసుకుంది. 

This post was last modified on January 14, 2024 4:13 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

43 minutes ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

4 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

4 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

6 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

7 hours ago