ఈ సీజన్ లో అత్యథిక ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఓటిటి రిలీజ్ గా యానిమల్ కే ప్రధమ స్థానం దక్కుతుంది. డిసెంబర్ 1న విడుదలై కంటెంట్ మీద ఎన్నో విమర్శలు, చర్చలు జరిగినా నెరవకుండా బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో చోటు దక్కించుకోవడం చిన్న విషయం కాదు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రతిభ హిందీ వాళ్లకు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో తెలిసొచ్చింది. డిజిటల్ వెర్షన్ లో కట్ చేయని ప్రింట్ ఇస్తానని సందీప్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గుర్తే. కనీసం పది నిమిషాలకు పైగా ఎక్స్ ట్రా ఫుటేజ్ ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా యానిమల్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ రేపో ఎల్లుండో ఆ లాంఛనం జరిగిపోతుంది. నార్త్ మల్టీప్లెక్సుల నిబంధనల ప్రకారం 45 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయిపోవడంతో ఇంకే అడ్డంకులు లేవు. 900 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టిన యానిమల్ సహస్రం చేరుకోవాలని మూవీ లవర్స్ బలంగా కోరుకున్నారు. అయితే కేవలం ఇరవై రెండు రోజుల గ్యాప్ తో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, డంకీ వచ్చేయడంతో ఆ ఫీట్ సాధ్యపడలేదు. ఇంకా చాలా చోట్ల యానిమల్ సింగల్ షోలు ఆడుతూనే ఉంది.
లెక్కల సంగతి పక్కనపెడితే అసలు థియేటర్లో చూడని వాళ్ళు యానిమల్ ని ఓటిటిలో చూశాక ఎలాంటి రియాక్షన్లు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఈ సినిమా మీద విరుచుకుపడటం, దానికి యానిమల్ టీమ్ ఘాటుగా బదులు చెప్పడం వైరలయ్యింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ స్క్రీన్ ఆడియెన్స్ దీన్ని ఫ్రెష్ గా చూశాక ఎలాంటి రియాక్షన్లు వస్తాయో చూడాలి. అన్నట్టు యానిమల్ పార్క్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం సందీప్ వంగా చెప్పడం లేదు. ప్రభాస్ స్పిరిట్ డేట్ ని డిసైడ్ చేశాక అప్పుడు రెండో భాగం గురించి ప్లాన్ చేసుకుంటారు.
This post was last modified on January 13, 2024 4:39 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…