ప్రభాస్ ని డార్లింగ్, మిర్చి నాటి హీరోయిజం ప్లస్ లుక్స్ లో చూడాలని వెయిట్ చేస్తున్న అభిమానుల కోరిక దర్శకుడు మారుతీ తీర్చేలా ఉన్నాడు. ఈ ఇద్దరి కలయికలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ‘రాజా సాబ్’ టైటిల్ ని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. తొలుత రాజా డీలక్స్, రాయల్ అంటూ ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఫైనల్ గా అందరి అంగీకారం ఒకదాని వైపే మొగ్గు చూపడంతో ఆ మేరకు ఫిక్స్ చేశారని సమాచారం. ఎల్లుండి జనవరి 15 దీనికి సంబంధించిన ప్రకటన, ఫస్ట్ లుక్ రెండూ రాబోతున్నాయని తెలిసింది. టీజర్ వదులుతారో లేదో చూడాలి.
ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ ప్రభాస్ సరసన ఆడి పాడుతున్నారు. ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఎంటర్ టైన్ చేసేలా మారుతీ చాలా వెరైటీగా తీర్చిదిద్దారట. మరి ఇంత పెద్ద హీరోతో దెయ్యాలంటే రిస్క్ కదా అని అడిగితే చంద్రముఖి సృష్టించిన రికార్డులను గుర్తు చేస్తున్నారట దర్శకుడు. అంతకు మించి అనేలా రాజా సాబ్ ఉంటుందని, ఆత్మల ప్రస్తావన ఉన్నా అదేదో రొటీన్ హారర్ మూవీ తరహాలో ట్రీట్ మెంట్ ఉండదని నొక్కి చెబుతున్నారు.
సంజయ్ దత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ తండ్రి పాత్రని అంటున్నారు కానీ ఎంత వరకు నిజమో కొంచెం వెయిట్ చేసి చూడాలి. డిసెంబర్ విడుదల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కల్కి 2898 ఏడి మేలో వస్తుంది కానీ రాజా సాబ్ ని ఏడాది చివరిలో తేవడం మంచి ఆలోచన. ఏడాదికి రెండు రిలీజులు ఉండేలా చూశానని ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నెరవేరేలా దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. 2023లో ఆదిపురుష్-సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, 2024లో కల్కితో రాజా సాబ్ రావొచ్చు. దీని తర్వాత సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి ప్రాజెక్టులు లైన్ లో ఉంటాయి.
This post was last modified on January 13, 2024 7:35 am
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…