పిలిచి మరీ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకుడు అది కూడా మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినా సరే పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే ఎవరు వద్దంటారు. మీనాక్షి చౌదరి అదే చేసింది. శ్రీలీల మెయిన్ లీడ్ అని తెలిసినా సరే తనకూ అంతో ఇంతో ప్రాధాన్యం దక్కుతుందనే ఆశతో ఒప్పేసుకుంది. పైగా మరదలి క్యారెక్టర్ కాబట్టి ఒక పాట ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయడం సహజం. కాసేపు టాక్ గోల పక్కనపెడితే మీనాక్షి చౌదరికి దక్కిన స్క్రీన్ స్పేస్, కథ పరంగా ఆమె చేసిన పనులు చూసి అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. మరీ ఇంత అన్యాయమా అంటూ వాపోతున్నారు.
ఇంతకీ సినిమా మొత్తంలో మీనాక్షి చౌదరి చేసింది ఏమయ్యా అంటే మహేష్ బాబుకి భోజనం ప్లేటు తెచ్చివ్వడం, ఇంటికి రాగానే అమ్మకు కేకేసి చెప్పడం, మందు తాగుతుంటే ఆమ్లెట్ ప్లేట్ అందివ్వడం, అంతే. ఓసారి మావయ్య జయరాంతో బావ బయట అందరిని కొడుతున్నాడని కంప్లయింట్ చేయడం. ఇంతకు మించి ఇంకేమైనా కనిపిస్తే ఒట్టు. మందు సాంగ్ లో ఏమైనా నాలుగు స్టెప్పులు ఉంటాయనుకుంటే అవీ లేదు. శ్రీలీలకే బోనస్ గా అసలు పాటలు కాకుండా స్పెషల్ గా ఒక్కడు, పలాస వింటేజ్ సాంగ్స్ తో హుషారుగా స్టెప్పులు వేయించి స్పేస్ పెంచారు.
ఇప్పుడు మీనాక్షి డిమాండ్ ఏమి తక్కువ లేదు. వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్ ల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అన్నింటి కన్నా పెద్ద జాక్ పాట్ తమిళ స్టార్ విజయ్ తో ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలోనూ ఉంది. ఇన్ని క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పుడు గుంటూరు కారం లాంటి వాటిలో రాజీ పడటం వల్ల లాభం ఏమి లేదని ఫ్యాన్స్ కంప్లయింట్. అరవింద సమేత వీర రాఘవలో ఈషా రెబ్బ, అల వైకుంఠపురములో నివేత పేతురాజ్ లకు వచ్చిన సమస్యే ఈ అమ్మాయికీ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఫామ్ లో లేనప్పుడు చేశారు మీనాక్షి డిమాండ్ ఉన్నప్పుడూ ఒప్పుకుంది .
This post was last modified on January 12, 2024 6:31 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…