Movie News

జై హనుమాన్ – సీక్వెల్ త్వరగానే

రిలీజ్ ముందు రోజు భారీ సంఖ్యలో ఒక చిన్న సినిమా వందల ప్రీమియర్లు వేయడం చూసి ట్రేడ్ షాక్ అయినా నిర్మాతల నమ్మకమే గెలిచింది. దేశవ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీతో దాదాపు అన్ని హౌస్ ఫుల్స్ నమోదు చేయడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ నిలబడినట్టే కనిపిస్తోంది. కానీ అది ఏ స్థాయిలో అనేది ఓ వారం రోజులు ఆగితే కానీ చెప్పలేం. బహుశా ఆ నమ్మకంతోనే ఏమో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ని క్లైమాక్స్ లో ప్రకటించారు. 2025 విడుదలని చెప్పేశారు. అంటే వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందన్న మాట. ఆల్రెడీ కొంత భాగం తీశారా లేదానేది సస్పెన్స్.

పబ్లిక్ టాక్ చూస్తుంటే జై హనుమాన్ కి రూట్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. సినిమాటిక్ యూనివర్స్ సృష్టిస్తానని అందులో సూపర్ హీరోలు ఉంటారని చెప్పిన ప్రశాంత్ వర్మ రెండో భాగంలో హనుమంతుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు క్లూ ఇచ్చాడు. ప్రపంచ నాశనంకోసం అసుర గణం తరలి వస్తోంది కాబట్టి దాన్ని అణచాలంటే ఖచ్చితంగా నువ్వే రావాలి హనుమా అంటూ విభీషణుడితో చెప్పించడం సీక్వెల్ స్టోరీకి సంబంధించి క్లూగా చెప్పుకోవచ్చు. ఎండింగ్ కార్డు కూడా పర్ఫెక్ట్ గా కట్ చేయడం ద్వారా ఆసక్తి రేపడంలో ప్రశాంత్ వర్మ సక్సెసయ్యాడు.

ఒకవేళ జై హనుమాన్ త్వరగా తీస్తే మాత్రం బడ్జెట్ విషయంలో రాజీ ఉండకపోవచ్చు. హనుమాన్ బాక్సాఫీస్ లెక్కల్లో ఎంత పే చేస్తుందనే దాన్ని బట్టి ఏ మేరకు ఖర్చుని పెంచాలనేది నిర్ణయించుకోవచ్చు. పరిమితులు ఉంటేనే ఇంత క్వాలిటీ తెచ్చినప్పుడు ఒకవేళ హద్దులు చెరిపేస్తే ఏ స్థాయిలో మేజిక్ చేయొచ్చో ఊహించుకోవచ్చు. కేవలం ఏడాది టైం తీసుకోవడం చూస్తే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కోసం ఏళ్ళ తరబడి సమయం అవసరం లేకుండానే పూర్తి చేసేలా ఉన్నాడు. మొత్తం 12 సినిమాలతో యునివర్స్ ని పూర్తి చేస్తానన్న ఈ యువ దర్శకుడు ఇంకే సూపర్ హీరోలను తీసుకొస్తాడో.

This post was last modified on January 12, 2024 8:05 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

23 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago