మాములుగా ఒక సినిమా ఏదైనా ఓటిటి స్ట్రీమింగ్ మొదలుపెట్టుకుంటే దాన్ని తీసేయడమంటూ ఉండదు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ విషయంలో పటిష్టంగా పాలసీలు ఫాలో అవుతాయి. ఎలాంటి వివాదాలు వచ్చినా సరే అంత సులభంగా తలొగ్గవు. కానీ గత వారం విడుదలైన నయనతార అన్నపూరణి కేసులో మాత్రం వెనక్కు తగ్గక తప్పలేదు. లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని, హిందూ మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని మధురైకి చెందిన కొందరు కొద్దిరోజుల క్రితం కేసు వేయడంతో వ్యవహారం మలుపు తిరిగింది.
దీనికి తోడు పలు రాజకీయ పార్టీలు అన్నపూరణిని బ్యాన్ చేయాలని నినాదం తలెత్తుకోవడంతో చివరికి నెట్ ఫ్లిక్స్ తన ప్లాట్ ఫార్మ్ నుంచి ఆ సినిమాని తొలగించింది. ఇది తాత్కాలికమా లేక ఎప్పటికీనా అనేది ఇంకా తేలాల్సి ఉంది. విచిత్రం ఏంటంటే డిసెంబర్ 1 థియేటర్లలో రిలీజైనప్పుడు దీని గురించి చిన్న నిరసనలు తప్ప తీవ్ర వ్యతిరేకత ఎవరూ చూపించలేదు. దీనికి తోడు ఫ్లాప్ టాక్ రావడంతో ఆడియన్స్ దూరంగా ఉన్నారు. తీరా డిజిటల్ లో వచ్చాక చూస్తే షాకింగ్ కంటెంట్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా మనోభావాలు దెబ్బ తిని ఏకంగా దాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి తీసేసే దిశగా వెళ్ళింది.
ఇంతకు ముందు చెప్పినట్టు అన్నపూరణిలో నిజంగానే అభ్యంతర పెట్టే కంటెంట్ ఉంది. సంప్రదాయాలకు కట్టుబడిన ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ బిర్యానీ వండేందుకు తాపత్రయపడటం, రుచి బాగా రావాలని బురఖా వేసుకుని నమాజ్ చేయడం లాంటి అర్థం లేని పైత్యం దర్శకుడు చాలానే జోడించాడు. ఇది ముస్లిం వర్గాలకే నచ్చలేదు. మరీ ఓవర్ గా చూపించారని వాళ్ళూ మండి పడ్డారు. కోర్టు కేసు సీరియస్ గా మారడంతో నెట్ ఫ్లిక్స్ వెంటనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. తెలుగుతో సహా ఇతర డబ్బింగ్ భాషల్లో అందుబాటులో ఉన్న అన్నపూరణిని ఇక అఫీషియల్ గా చూసే ఛాన్స్ లేనట్టే.
This post was last modified on January 11, 2024 1:10 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…