త్రివిక్రమ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆయన మార్కు కామెడీ, చమత్కారం, వ్యంగ్యం, డైలాగుల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతారు అభిమానులు. సినిమాకు సంబంధించి చిన్న ప్రోమో రిలీజ్ చేసినా.. ఆయన టచ్ మీద చర్చ జరుగుతుంది. ఇక ట్రైలర్ రిలీజ్ అయింది అంటే.. డిస్కషన్ అంతా త్రివిక్రమ్ మార్కు గురించే ఉంటుంది. అయితే గుంటూరు కారం సినిమాకు సంబంధించి మొదటి నుంచి త్రివిక్రమ్ టచ్ కనిపించకపోవడం గమనార్హం. ఇది సగటు మా సినిమాలా కనిపిస్తోంది తప్ప త్రివిక్రమ్ ప్రత్యేకత లేదని ఆయన ఫ్యాన్స్ ముందు నుంచి కొంత ఫీలవుతున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా ఆయన ముద్ర తక్కువనే చెప్పాలి. త్రివిక్రమ్ గత సినిమాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే.. గుంటూరు కారం ఆయన సినిమాయేనా అనిపించేలా ఉంది ట్రైలర్. ఇందులో హీరో క్యారక్టర్, యాక్షన్ ఎక్కువగా హైలెట్ అయ్యాయి. అయితే ట్రైలర్ చూస్తే పైసా వసూల్ అని మాత్రం అనిపించింది.
అయితే ట్రైలర్లో త్రివిక్రమ్ మార్కు లేదని మహేష్ ఫాన్స్ పెద్దగా ఏమి ఫీల్ అవ్వట్లేదు. నిజానికి ఈ విషయాన్ని సానుకూలంగానే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మహేష్ తో త్రివిక్రమ్ తీసిన రెండు చిత్రాలు అతడు, ఖలేజాల్లో స్పష్టంగా ఆయన ముద్ర కనిపిస్తుంది. త్రివిక్రమ్ అంటే మాటల మాంత్రికుడు అనడానికి ఆ రెండు చిత్రాలు నిదర్శనం. వాటిలో కామెడీ, డైలాగ్స్ మామూలుగా పేలలేదు. కానీ ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. అతడు కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది తప్ప కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. ఇక ఖలేజా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. త్రివిక్రమ్ మార్క్ విషయంలో వాటితో పోల్చుకోలేని విధంగా ఉన్న గుంటూరు కారం.. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది.
మహేష్ అభిమానులు, మాస్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అందుకే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి గురూజీ మార్కు లేదు, కాబట్టి హిట్టు కొట్టబోతున్నాము అని మహేష్ అభిమానులు సరదాగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండడం విశేషం.
This post was last modified on January 8, 2024 10:23 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…