నిన్న రాత్రి విడుదలైన గుంటూరు కారం ట్రైలర్ పన్నెండు గంటలు దాటేలోగానే 25 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. విపరీతమైన జాప్యం మధ్య మధ్యాన్నం నాలుగు గంటల నుంచి ఎదురు చూస్తున్న అభిమానులకు రాత్రి తొమ్మిదికి వదిలి ఫుల్ మీల్స్ అనిపించేలా ఉపశమనం కలిగించారు. ఫ్యాన్స్ కోణంలో తమ హీరో స్క్రీన్ ప్రెజెన్స్, ఊర మాస్ మ్యానరిజం, చాలా ఏళ్లుగా మిస్ అవుతున్న పోకిరి టైపు వింటేజ్ ఎలివేషన్ ఇవన్నీ సంతృప్తినిచ్చాయి. అయితే సగటు ప్రేక్షకులకు ఏమనిపించిందనే అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
వీలైనంత కథను ఎక్కువ రివీల్ చేయకుండా త్రివిక్రమ్ తీసుకున్న జాగ్రత్త వల్ల ఆ కార్యమైతే నెరవేరింది కానీ కేవలం ట్రైలర్ చూసిన వెంటనే ఎక్స్ ట్రాడినరీ అనిపించియే మేజిక్ చేయలేకపోయారని కొందరు నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఎంతసేపూ మహేష్ బాబు డైలాగు టైమింగ్ ని హైలైట్ చేయడం తప్పించి సినిమాలో ఇతర అంశాలను చూపించలేదని వాళ్ళ కంప్లయింట్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం స్పెషల్ గా అనిపించలేదని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అఖండ రేంజ్ లో ఆశిస్తే సర్కారు వారి పాట కన్నా కాస్త మెరుగ్గా ఇచ్చారని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
సో మాస్ వర్గాలకు నచ్చే విధంగా ట్రైలర్ పాసయ్యింది కానీ ఇక మాట్లాడాల్సింది సినిమానే. అత్యథిక థియేటర్లలో జనవరి 12 రమణ చేయబోయే జాతర కోసం ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. జనవరి 9 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడతారు. సలార్ కి ఇచ్చిన పెంపునే దీనికి ఇస్తారని తెలంగాణ టాక్. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గరిష్టంగా నలభై రూపాయల కంటే హైక్ ఉండకపోవచ్చు. గుంటూరు కారం కన్నా మూడింతలు ఎక్కువ బడ్జెట్ తో తీసిన సలార్ కి అంతే ఇచ్చారు. మహేష్ బాబు ఓపెనింగ్స్ కి ట్రైలర్ టాక్ తో పని లేదు కానీ కొన్ని షోలు పడ్డాక ముందుకు తీసుకెళ్లేది మాత్రం సినిమా కంటెంటే.
This post was last modified on January 8, 2024 11:31 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి…
2024.. మరో రెండు రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది. అయితే.. ఈ సంవత్సరం కొందరిని మురిపిస్తే.. మరింత మందికి గుణపాఠం చెప్పింది.…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు జేజేలు కొట్టి.. జ్యోతులు పట్టిన చేతులే.. నేడు కనుమరుగు…
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. ఆయన కుమారుడు, ఆయన కోడలు బ్రాహ్మణి…
2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్…