అక్కినేని నాగార్జున కెరీర్ కొన్నేళ్లుగా ఒడుదొడుకులతో సాగుతోంది. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన తర్వాత ఆయనకు నిఖార్సైన హిట్ లేదు. దేవదాస్, బంగార్రాజు లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ మిగతావన్నీ తీవ్ర నిరాశనే మిగిల్చాయి. నాగ్ నుంచి చివరగా వచ్చిన ఘోస్ట్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అక్కినేని వారి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అంతా హరించుకుపోయిన పరిస్థితి కనిపించింది. ఈ స్థితి నుంచి నాగ్ ఎలా పుంజుకుంటాడా అని అందరూ ఎదురు చూశారు. తన కొత్త సినిమా మొదలు పెట్టడంలో నాగ్ చాలా జాప్యం చేయడంతో ఆయన పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది.
ఈ అక్కినేని సీనియర్ హీరో బౌన్స్ బ్యాక్ కావడం ఇక అసాధ్యం అనుకున్నారు చాలామంది. కానీ ఈ సంక్రాంతికి రాబోతున్న నా సామి రంగకు అభిమానుల్లో ట్రేడ్ వర్గాల్లో, ఉన్న క్రేజ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. పండుగ సినిమాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ బిజినెస్ చేసిన చిత్రం ఇదే. పక్కాగా పండుగకు సూట్ అయ్యే సినిమాలా కనిపిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల బాగానే ఆసక్తి నెలకొంది. బయర్లు కూడా ఈ సినిమాను మంచి రేటుకి కొన్నట్లు సమాచారం.
కాస్త మంచి టాక్ రావాలి కానీ గుంటూరు కారం తర్వాత సంక్రాంతి సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టే చిత్రం ఇదే అవుతుంది అని ట్రేడ్ పండిట్లో అంచనా వేస్తున్నారు. పట్టుబట్టి ఈ సంక్రాంతికి సినిమాని తీసుకొస్తున్న నాగ్ కచ్చితంగా హిట్టు కొడతాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 7, 2024 8:18 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……