మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో మల్టీస్టారర్స్ చాలా తక్కువ. ఫ్యాన్స్ ఒప్పుకోరనే కారణంగా మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెనుకాడుతుంటారు తెలుగు స్టార్లు. అయితే ఈ మధ్య మన హీరోలు కూడా మారుతున్నారు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ కోసం విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్‌బాబు చేతులు కలిపితే… ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే వీటన్నింటికంటే ముందే ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట శతాధిక చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు.
కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు… తన నూరో చిత్రంగా ఓ భారీ మల్టీస్టారర్ అనుకున్నారట. సీనియర్ స్టార్ త్రయం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌లు హీరోలుగా ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారట. దీనికి ‘త్రివేణి సంగమం’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. అయితే ముగ్గురు స్టార్లను ఒకే స్క్రీన్ మీద చూపించాలని దర్శకేంద్రుడు చేసిన ఈ ప్రయత్నం వర్కవుట్ కాలేదు.
దాంతో అల్లుఅర్జున్‌ను హీరోగా పరిచయం చేస్తూ తన 100వ చిత్రంగా ‘గంగోత్రి’ని చేశారు రాఘవేంద్రుడు. టాప్ స్టార్లు చిరంజీవి, నాగ్, వెంకీ ఒకే సినిమాలో కనిపిస్తే… అది పెను సంచలనం క్రియేట్ చేసి ఉండేది.
ఆ టైమ్‌లో వారికున్న క్రేజ్‌కు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసేది. టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా పెరిగేవి. అప్పట్లో వర్కవుట్ కాకపోయినా ‘త్రివేణి సంగమం’ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారట రాఘవేంద్రరావు. అదీగాక ఇప్పుడు స్టార్లలతో పాటు ఫ్యాన్స్ ఆలోచనావిధానం కూడా మారింది. కంటెంట్ ఉంటే ప్రయోగాత్మక చిత్రాలను కూడా ఆదరిస్తున్నారు తెలుగు జనాలు. అందుకే ఈ మెగా, అక్కినేని, దగ్గుపాటి మల్టీస్టారర్ పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అవుతుందనే ధీమాగా ఉన్నారు దర్శకేంద్రుడు.
ఇకపోతే ‘శ్రీరామదాసు’ తర్వాత సరైన సక్సెస్ అందుకోకపోయిన రాఘవేంద్రుడు… ‘ఓం నమో వెంకటేశాయ’ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. వీలైతే త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు దర్శకుడిగా మారిన తన తనయుడు ప్రకాశ్‌కు ‘త్రివేణి సంగమం’ బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది.
This post was last modified on April 26, 2020 1:46 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…