అతి సర్వత్రా వర్జయేత్ తరహాలో రీ రిలీజుల ట్రెండ్ ని విపరీతంగా వాడేసుకుని పాత బ్లాక్ బస్టర్స్ ఇక వద్దు బాబోయ్ అనేదాకా ఆడియన్స్ ని తీసుకొచ్చారు టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు. దీనికి ప్రధాన కారణం టికెట్ రేట్లే. కొత్త సినిమాల ధరలకే యూట్యూబ్ లో ఫ్రీగా దొరికే వాటిని థియేటర్ కొచ్చి చూడమంటే ఎన్నిసార్లని సహకరిస్తారు. దీనికో గొప్ప విరుగుడు కనిపెట్టింది చెన్నైలోని ఒక థియేటర్ యాజమాన్యం. నగరంలో కమల పేరుతో ఉన్న ఈ హాలుకు గత కొంత కాలంగా ఆక్యుపెన్సీ లేక నిర్వహణ కష్టమైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. దానికి కారణం టికెట్ రేట్లేనని గుర్తించింది.
దీని కోసం ధనుష్ 3 రీ రిలీజ్ ని మొదటి మెట్టుగా వాడుకుంది. ఫస్ట్ క్లాస్ టికెట్ 69 రూపాయలు, సెకండ్ క్లాస్ కేవలం 49 రూపాయలు పెట్టి అమ్మకాలు షురూ చేసింది. ఇంకేముంది ప్రేక్షకులు ఎగబడటం మొదలుపెట్టారు. ఏదో వారం లోపే సర్దుకున్న హడావిడి కాదిది. ఏకంగా యాభై రోజుల పాటు నాన్ స్టాప్ గా కమలలో 3 సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతూనే ఉంది. ఇప్పటిదాకా సుమారు 90 వేల టికెట్లు అమ్మేశారు. సెకండ్ షోకు సైతం జనం తండోప తండాలుగా వస్తున్నారు. ఇక ఉదయం, మధ్యాన్నం కాలేజీ కుర్రకారు మధ్యలో దూరి టికెట్లు సంపాదించుకోవడం అసాధ్యమే.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉంటే థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం పాత సినిమా అయినా సరే ఎగబడి చూస్తారని. నిజానికి 3 బ్లాక్ బస్టర్ కాదు. కోలవెరిడి పాట, ధనుష్-శృతి హాసన్ నటన తప్ప మరీ గొప్పగా ఏమి ఉండదు. ఏళ్ళు గడిచాక కల్ట్ క్లాసిక్ బిరుదు వచ్చింది. అయినా సరే ఇంతగా ఆదరణ దక్కించుకోవడం మాటలు కాదు. మన దగ్గర కూడా ఇలాంటి స్ట్రాటజీలు ఫాలో అయితే గల్లాపెట్టెలు నిండిపోవడం ఖాయం. కొత్తగా రిలీజయ్యే చిన్న సినిమాలకు సైతం ఈ తరహా అమలు చేస్తే ఖచ్చితంగా వాటికి ఊపిరినిచ్చినట్టు అవుతుంది.
This post was last modified on January 6, 2024 2:47 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…