గత ఏడాది దసరా, హాయ్ నాన్న రూపంలో ఒక బ్లాక్ బస్టర్, ఒక సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్న తీరు ఆసక్తి రేపుతోంది. కథ నచ్చకపోయినా, తనకు ప్రాధాన్యం అంతగా లేదనిపించినా ఫిల్టర్ లేకుండా నో చెప్పేస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా టిజె జ్ఞానవేల్ తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కోసం ముందు నానినే అడిగారు. కానీ సూపర్ స్టార్ తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ఉన్న స్క్రీన్ మీద తనకెంత లెన్త్ దొరుకుతుందో అర్థం చేసుకుని సున్నితంగా వద్దన్నాడు.
తర్వాత కాలేజీ డాన్ తో వెలుగులోకి వచ్చిన దర్శకుడు శిబి చక్రవర్తి నానికి ఒక కథ చెప్పి ఓకే చేయించుకుని హైదరాబాద్ లో ఆఫీస్ తీసి మరీ టీమ్ తో వర్క్ చేయించారు. తీరా ఫైనల్ వెర్షన్ అయ్యాక అతను చెప్పిన బడ్జెట్ కి కళ్ళు తిరగడంతో క్యాన్సిల్ చేశారు. ఇదంతా అఫీషియల్ గా వచ్చిన సమాచారం కాకపోయినా సదరు బృందాలతో దగ్గరగా వ్యవహరించిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వార్తే. ఇప్పడు బలగం వేణు ఎలాగైనా నానితో ప్రాజెక్టు లాక్ చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. వెనుక నిర్మాత దిల్ రాజు అండ ఉండటంతో ఫస్ట్ సిట్టింగ్ లో లైన్ అయితే బాగుందనిపించుకున్నాడు.
సరిపోదా శనివారం తప్ప నాని ఇంకెవరికి కమిట్ మెంట్ ఇవ్వలేదు. జాగ్రత్తగా చేసుకుంటున్న ప్లానింగ్ వల్ల తనకు ఫ్లాపులు రావడం లేదని గుర్తించి అది ఇలాగే మైంటైన్ చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. నానితో ఎంసీఏ, నేను లోకల్ రెండు హిట్లు ఇచ్చిన దిల్ రాజు మాటని నాని కాదనడు. అలా అని సబ్జెక్టుని గుడ్డిగా ఓకే చేయడు. ఇన్ సైడ్ టాక్ అయితే దాదాపు బలగం వేణుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని అంటున్నారు. ఇంకో వైపు శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. మరోపక్క త్రివిక్రమ్ తో చేయొచ్చనే వార్త గట్టిగా తిరుగుతోంది. క్లారిటీ రావాలంటే ఇంకొంత ఆగాల్సి వచ్చేలా ఉంది.
This post was last modified on January 6, 2024 5:46 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…