ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చైల్డ్ యాక్టర్ హీరోగా మారాక అతనికి పెద్ద అవకాశాలు రావడం అంత సులభం కాదు. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరికే సరైన బ్రేక్ దక్కక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటిది తేజ సజ్జకి క్రేజీ ప్రాజెక్టులు చేతికి రావడం చూస్తే మాములు సుడి అనిపించడం లేదు. హనుమాన్ మీద ఇప్పటికే నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. కంటెంట్ బాగుండి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి మెప్పించిందా బ్లాక్ బస్టర్ ఖాయమే. కేవలం హిందీ వెర్షన్ కే వెయ్యికి పైగా స్క్రీన్లను ప్లాన్ చేయడం మాములు విషయం కాదు. ఇక్కడితో అయిపోలేదు.
ఇది రిలీజ్ కాకుండానే తేజ సజ్జ మరో భారీ చిత్రాన్ని పాకెట్ లో వేసుకున్నారు. ఈగల్ దర్శకుడు కార్తీక ఘట్టమనేని తీస్తున్న ఇంకో మూవీలో తనదే ప్రధాన పాత్రట. ఇందులో మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ లు కూడా ఉండబోతున్నారని తెలిసింది. ఇలాంటి మల్టీస్టారర్ లో భాగం కావడమంటే పెద్ద ప్రమోషనే. ఈగల్ అవ్వగానే కార్తీక్ దీనిలో పనులు మొదలుపెట్టడు. 2024లోనే విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే దీనికి నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లోనే కథ నడుస్తుందని వినికిడి.
ఇలాంటి ప్లానింగ్ తో తేజ సజ్జ త్వరగానే మీడియం స్టార్ల లీగ్ లోకి వెళ్లిపోవచ్చు. కుర్రాడు ఇంకా లేతగానే ఉన్నప్పటికీ ఆఫర్లు మాత్రం భారీగా గట్టిగా వస్తున్నాయి. ఓ మై బేబీలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేయడం దగ్గరి నుంచి సోలో హీరోగా ప్యాన్ ఇండియా మూవీస్ దక్కించుకోవడం వరకు తేజ ప్రయాణం మంచి జోరు మీదుంది. కాకపోతే హిట్లు పడి వాటిని నిలబెట్టుకోవడం కీలకం. హనుమాన్ కనక పెద్ద హిట్టు కొడితే బాలీవుడ్ లోనూ గుర్తింపు వస్తుంది. తద్వారా నెక్స్ట్ చేయబోయే సినిమాలకు రీమేక్, డబ్బింగ్, ఓటిటి హక్కుల పరంగా డిమాండ్ ఏర్పడుతుంది. ఇంతకన్నా అతను కోరుకునేది ఏముంటుంది.
This post was last modified on January 5, 2024 9:56 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…