సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల పంచాయతీని తెంచేందుకు ఆయా చిత్రాల నిర్మాతలు, ఇతర సినీ పెద్దలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మాతల మండలి అధ్యక్షుడు దిల్ రాజు.. ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. హీరోల స్థాయి ఆధారంగా సంక్రాంతి సినిమాల్లో ప్రయారిటీ నంబరింగ్ ఇచ్చారాయన. దీని ప్రకారం మహేష్ బాబు సినిమా గుంటూరు కారంకి నంబర్ వన్ రేటింగ్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాతి స్థానాల్లో నాగార్జున, వెంకటేష్ చిత్రాలు నా సామి రంగ, సైంధవ్ లను నిలబెట్టాడు. చివరి స్థానాన్ని హనుమాన్ చిత్రానికి కేటాయించాడు.
అయితే హీరోల రేంజిని బట్టి ఆయన నంబరింగ్ ఉండగా.. ప్రేక్షకాసక్తి విషయంలో హనుమాన్ అగ్రస్థానంలో ఉందన్న విషయం దిల్ రాజు మర్చిపోతున్నారు. ఇందుకు ఒక రుజువు కూడా ఉంది.
కొత్త సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తిని ఈమధ్య బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ నంబరును బట్టి అంచనా వేస్తున్నారు. అందులో హనుమాన్ సినిమాకే నంబర్ వన్ ర్యాంకింగ్ ఉండడం విశేషం. ఈ సినిమాకు బీఎంఎస్ లో ఏకంగా 2 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ ఉండడం విశేషం.
గుంటూరు కారం కంటే ఒక వెయ్యి మంది ఎక్కువగానే ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించారు. మిగతా రెండు సంక్రాంతి సినిమాలు నా సామిరంగ, సైంధవ్ వరుసగా 47 వేలు, 69 వేలు ఇంట్రెస్ట్స్ తో సాగుతున్నాయి. మరి ప్రేక్షకుల ఆసక్తి ఏ సినిమా పట్ల ఎక్కువగా ఉందన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు జనవరి 12న హైదరాబాద్లో గుంటూరు కారంతో పోలిస్తే 10% స్క్రీన్లు కూడా ఇవ్వకపోవడం అన్యాయం కాక మరేంటి?
This post was last modified on %s = human-readable time difference 9:35 pm
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…