మొత్తానికి సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల పంచాయతీ తేలిపోయింది. ఐదు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేసే అవకాశం లేకపోవడంతో.. ఒక చిత్రం రేసు నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఆ ఒక్క చిత్రం ఏదన్న ఉత్కంఠకు తెరదించుతూ ఈగల్ సినిమా పోటీ నుంచి వైదొలిగింది. ఈ చిత్ర మేకర్స్ కొంత అయిష్టంగానే పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ముందు సంక్రాంతి సినిమాల్లో అన్నిట్లోకి చిన్నదైన హనుమాన్ ను పోటీ నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన సినిమా, అనేక సమీకరణాలు ముడిపడి ఉండడంతో పోటీ నుంచి వైదొలగలేదు. దీంతో ఈగల్ టీం త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ పరిణామం రవితేజ అభిమానులకు ఎంత మాత్రం రుచించడం లేదు. ఈగల్ ను వాయిదా వేయడంపై సోషల్ మీడియాలో వారు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
రవితేజ అభిమానుల కోపం ప్రధానంగా నా సామి రంగ సినిమా మీద కనిపిస్తోంది. ఈగల్ చిత్రం షూటింగ్ నెల కిందటే పూర్తయిందని, చాలా ముందుగానే సంక్రాంతి రిలీజ్ డేట్ ఇచ్చారని, విడుదలకు రెండు వారాల ముందే సెన్సార్ కూడా రెడీ అయిపోయిందని.. ఇలాంటి సినిమాను ఎలా వాయిదా వేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. లేటుగా సంక్రాంతి రేసులోకి వచ్చిన నా సామి రంగను పోటీ నుంచి తప్పించవచ్చు కదా అని వారంటున్నారు.
సంక్రాంతికి నాలుగు నెలల కిందటే షూటింగ్ మొదలుపెట్టుకొని ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ సినిమా జోలికి వెళ్లకుండా చాలాముందే ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ఈగల్ ను రేసు నుంచి తప్పించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళదే రాజ్యం అనడానికి ఇది నిదర్శనం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 5, 2024 5:08 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…