ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి చాలా లేటుగా వచ్చిన సినిమా నా సామి రంగ. మిగతా పండుగ సినిమాలన్నీ షూటింగ్ సగం, అంతకంటే ఎక్కువ పూర్తి చేసుకుని సంక్రాంతి విడుదల ఖాయం చేసుకుంటున్న దశలో ఈ సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. అయితే అనౌన్స్మెంట్లోనే సంక్రాంతి రిలీజ్ అని కన్ఫర్మ్ చేసేసింది చిత్ర బృందం. లేటుగా సెట్స్ మీదికి వెళ్ళినప్పటికీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న నా సామి రంగ.. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే రావాలని పట్టుదలతో సాగింది.
ప్రమోషన్లు కొంచెం ఆలస్యంగా మొదలైనప్పటికీ సినిమాకు డీసెంట్ బజ్ క్రియేట్ అయింది. నాగార్జున చాకచక్యంగా ఈ సినిమాకు మార్కెటింగ్, బిజినెస్ కూడా చక్కబెట్టేశాడు. తన భాగస్వామ్యం ఉన్న మాటీవీకి నాన్ థియేట్రికల్ హక్కులన్నీ మంచి రేటుకు అమ్మించాడు. అయితే ఎంత ప్రణాళికతో అడుగులు వేసినప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ కొంచెం ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
నా సామి రంగ విడుదలకు 10 రోజులు మాత్రమే సమయం ఉండగా.. ఇంకా కొంతమేర చిత్రీకరణ మిగిలే ఉందట. టాకీ అంతా పూర్తి కావడానికి అటు ఇటుగా ఇంకో ఐదు రోజులు పట్టొచ్చు అని అంటున్నారు. షూటింగ్ ఇలా జరుగుతుండగానే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దీంతో టీం కొంచెం కిందా మీదా అవుతున్నట్లు సమాచారం. ఇంత హడావిడిలో థియేటర్లు చూసుకోవాలి. రిలీజ్ పక్కాగా ఉండేలా జాగ్రత్త పడాలి. మరోవైపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయాలి. మొత్తంగా నాగ్ అండ్ టీం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చిత్రవర్గాల సమాచారం.
అయితే సంక్రాంతి పండక్కి పక్కాగా సూట్ అయ్యే సినిమా కావడంతో ఈ సీజన్ మిస్ అవ్వడానికి వీల్లేదని చిత్ర బృందం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతోంది. కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండడంతో సంక్రాంతికి నా సామిరంగ కచ్చితంగా మంచి హిట్ అయి తమ కష్టానికి ఫలితం చిత్త బృందం ధీమాగా ఉంది. కొరియాగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న నా సామిరంగ జనవరి 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 4, 2024 11:11 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…