సంక్రాంతి రేసులో అందరికంటే చిన్న హీరోని పెట్టుకుని పెద్ద బడ్జెట్ తో వస్తున్న హనుమాన్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. టీమ్ క్రమం తప్పకుండా ప్రమోషన్లు యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటోంది. ఒకవైపు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అప్డేట్స్ ఇస్తూ ఇంకో వైపు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు గట్రా చక్కగా ప్లాన్ చేస్తోంది. ప్రత్యేకంగా దీని మీదే ఆసక్తి ఉన్న ఆడియన్స్ కున్న టెన్షన్ ఒకటే. జనవరి 12 అదే రోజు విడుదల కాబోతున్న గుంటూరు కారం తాకిడిని ఈ ఫాంటసీ మూవీ ఎలా తట్టుకుంటుందాని. దాని కోసమే ఒక మంచి వ్యూహం సిద్ధం చేసినట్టు వినిపిస్తోంది.
అదేంటంటే ఎర్లీ ప్రీమియర్లు. గత రెండేళ్లలో చాలా సినిమాలకు ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి షోలు వేయడం బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు హనుమాన్ కి అదే అనుసరించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. దీని వల్ల ఒక లాభం ఉంది. క్రేజ్ ఉన్న పాన్ ఇండియా మూవీ. జనవరి 10 రాత్రే షోలు వేస్తే ప్రేక్షకులు ఎగబడి వస్తారు. ఎలాగూ మరుసటి రోజు మహేష్ బాబుకి ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ముందే చూడాలని ఫిక్సవుతారు. పైగా మహేష్ ఫ్యాన్స్ సైతం తమ పోటీదారు కంటెంట్ ఎలా ఉందోననే ఆసక్తితో భారీ సంఖ్యలో టికెట్లు కొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
హనుమాన్ బృందం నమ్మకాన్ని తగ్గట్టు రాత్రే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా అది ఓ రేంజ్ లో హెల్ప్ అవుతుంది. వెంటనే కాకపోయినా ఆ టాక్ తాలూకు ప్రభావం క్రమంగా ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ కు వెళ్ళిపోయి పండగ సెలవుల్లో ఉన్న పిల్లలను, ఫ్యామిలీలను కదుపుతుంది. గుంటూరు కారం టికెట్లు అంత సులభంగా దొరికే ఛాన్స్ తక్కువ కాబట్టి ముందైతే హనుమాన్ చూసేద్దాం అనుకునే బాపతు ఎక్కువ ఉంటారు. ఈ విశ్లేషణలు లోతుగా చేసుకున్నాకే హనుమంతుడు ప్రీమియర్లకు జై కొట్టాడని తెలిసింది. హైదరాబాద్ లో వేసే షోకు టాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తాన్ని పిలుస్తారట.
This post was last modified on January 4, 2024 12:59 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…