ఒకపక్క వాయిదా లేదహో అంటూ ఈగల్ నిర్మాతలు పోస్టర్లు వదులుతూనే ఉన్నారు. నిన్న ఎంత పోస్ట్ పోన్ ప్రచారం జరిగినప్పటికీ సాయంత్రం సెన్సార్ వచ్చిందన్న సమాచారంతో జనవరి 13 డేట్ ని మరోసారి ధృవీకరిస్తూ కొత్త స్టిల్ ఇవ్వడం రవితేజ ఫ్యాన్స్ ని రిలాక్స్ అయ్యేలా చేసింది. అయితే అది కేవలం కొద్దిగంటలకే పరిమితమయ్యింది. ఉదయం లేవగానే మళ్ళీ ఈగల్ వార్తలు షురూ. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆ తేదీకి షిఫ్ట్ చేశారనే కొన్ని ట్వీట్లను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు రీ పోస్ట్ చేయడంతో అనుమానం కాస్తా నిజమయ్యిందని అభిమానులు ఆందోళన చెందారు.
ఇప్పటిదాకా ఈగల్ తరఫున పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి అఫీషియల్ వాయిదా నోట్ రాలేదు. ఒకవేళ తప్పుకోవడం కన్ఫర్మ్ అయితే ఆ అవకాశం నా సామిరంగకు బంగారం అయిపోతుంది. ఎందుకంటే మాస్ మహారాజా కోసం బ్లాక్ చేసిన థియేటర్లు అధిక శాతం నాగార్జునకు వచ్చేస్తాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లు సరిపడా స్క్రీన్ కౌంట్ తో పక్కా ప్లానింగ్ తో ఉన్నాయి. నాగ్ కు సైతం అన్నపూర్ణ రూపంలో స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉన్నప్పటికీ తన స్థాయికి తగ్గట్టు కౌంట్ తెచ్చుకోవడం సవాల్ గా మారింది. అందుకే ఈగల్ పక్కకెళ్ళడం చాలా ప్లస్ అవుతుంది.
వీలైనంత త్వరగా వీటికి చెక్ పెట్టేలా సదరు నిర్మాతలు పూనుకుంటే మంచిది. ఫ్యాన్స్ మాత్రం వాయిదా మంచిదేనని ఫీలవుతున్నారు. ఇంత పోటీ మధ్య ఈగల్ లాంటి సీరియస్ మాస్ ఎంటర్ టైనర్ తేవడం కరెక్ట్ కాదని, దాని బదులు నెలాఖరుకు వెళ్తే మంచి ఓపెనింగ్స్ తో పాటు పాజిటివ్ టాక్ వసూళ్లకు అనుకూలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. రవితేజ మాత్రం నాలుగైదు రోజుల నుంచి ఈగల్ కు సంబంధించిన ట్వీట్లు పెట్టడం లేదు. పబ్లిసిటీ కోసం చేసిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూని మేకర్స్ ఇంకా వదల్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్న ఈ రిలీజ్ డ్రామా క్లైమాక్స్ ఏంటో చూడాలి.
This post was last modified on January 4, 2024 12:33 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు.…
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…