పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ దర్శకుడికైనా ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. సరైన బ్లాక్ బస్టర్ పడిందా దశ తిరిగిపోతుంది. హరిహర వీరమల్లు ఆఫర్ ఒప్పుకున్నప్పుడు క్రిష్ ఫీలింగ్ ఇదే అయ్యుంటుంది. కానీ జరిగింది వేరు. షూటింగ్ లో విపరీతమైన జాప్యం, సెట్లు కూలిపోవడం, పవన్ జనసేనలో బిజీగా కావడం, వేగంగా ఓ రెండు రీమేకులు చేయాలని నిర్ణయించుకోవడం ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ గ్యాప్ లోనే వైష్ణవ్ తేజ్ తో కొండపొలం తీశాడు కానీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో పేరు రాలేదు సరికదా అసలది క్రిష్ తీసిన విషయమే ఆడియన్స్ మర్చిపోయారు.
ఇంకో వైపు వెబ్ సిరీస్ లకు టర్న్ తీసుకుని తన ఆధ్వర్యంలోనే వేరే దర్శకుడితో ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా 9 అవర్స్ తీయించారు. చనిపోక ముందు తారకరత్న నటించిన మొదటి మరియు చివరి సిరీస్ ఇదే. తర్వాత కన్యాశుల్కం ఆధారంగా అంజలి-అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో శేష సిందూరావు డైరెక్షన్ లో ఇంకో సిరీస్ పూర్తి చేశారు. ఇలా టైం వేస్ట్ కాకుండా వీలైనంత బిజీగా ఉంటున్నారు కానీ మెగా ఫోన్ చేపడితే వచ్చే ఆనందం, సంతృప్తి నిర్మాణంలో రాదు. అందుకే ఓ లేడీ ఓరియెంటెడ్ కథని సిద్ధం చేసుకుని హీరోయిన్ కోసం చూస్తున్నారట.
మొదటి ఆప్షన్ గా వేదంలో చేసిన అనుష్క, రెండో ఛాయస్ గా కృష్ణం వందే జగద్గురుంలో నటించిన నయనతారను అడిగే ఆలోచనలో ఉన్నారట. స్వీటీ చిరంజీవి విశ్వంభరనే చేయాలో వద్దో తేల్చుకోలేని అయోమయంలో ఉంది. అలాంటప్పుడు క్రిష్ చెప్పే కథ మీద ఆసక్తి చూపించడం అనుమానమే. ఇక నయనతార రెమ్యునరేషన్ తట్టుకోవాలంటే బడ్జెట్ భారీగా ఉండాలి. కానీ కమర్షియల్ గా తమిళంలో తప్ప తెలుగులో ఆమెకు మార్కెట్ లేదు. సో ఇవన్నీ లెక్కలు వేసుకుని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా వీరమల్లుకి ఇంకో ఏడాది పట్టేలా ఉంది.
This post was last modified on January 4, 2024 10:40 am
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…