Movie News

వెంకటేష్ మనసులో ఉన్న రీ రిలీజ్

ఇప్పటిదాకా రీ రిలీజ్ ట్రెండ్ లో అందరు స్టార్ హీరోలవి కవరయ్యాయి కానీ విక్టరీ వెంకటేష్ ది మాత్రం బ్యాలన్స్ ఉండిపోయింది. అభిమానులు వాళ్ళ డిమాండ్ ని నిర్మాత సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ ఇప్పటిదాకా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. మొన్న డిసెంబర్ 13 వెంకీ పుట్టినరోజు సందర్భంగా ప్రేమించుకుందాం రా లేదా జయం మనదేరా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకున్నారు కానీ నెరవేరలేదు. అసలు వెంకటేష్ మనసులో ఏ సినిమా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం కలగడం సహజం. దానికి ఇవాళ జరిగిన సైంధ‌వ్‌ ట్రైలర్ లాంచ్ లో స్పష్టమైన సమాధానం దొరికింది.

వెంకటేష్ చూడాలనుకుంటున్న రీ రిలీజ్ నువ్వు నాకు నచ్చావ్. ఆయనే స్వయంగా ఈ మాట చెప్పడంతో అక్కడున్న వాళ్ళు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేయడానికి ఇంత కంటే మంచి ఆప్షన్ ఉండదని చెప్పడం చూస్తే దగ్గర్లోనే ప్లానింగ్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ మూవీ నిర్మాత స్రవంతి రవికిశోర్ గత ఏడాది నువ్వే నువ్వేని పునఃవిడుదల చేశారు. ఆ టైంలోనే నువ్వు నాకు నచ్చావ్ ప్రింట్ ని 4కె చేయించి పెట్టారు. సో ప్రింట్ సిద్ధంగా ఉంది కాబట్టి మంచి టైమింగ్ చూసుకుంటే చాలు. తెలుగు రాష్ట్రాల థియేటర్లు నవ్వులతో తడిసిపోతాయి.

కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వల్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థాయి స్టార్ రైటర్ గా మరింత ఎదిగింది. ఇప్పటికీ బోలెడు మీమ్స్ లో దీని రిఫరెన్సులు వాడుతూనే ఉంటారు. కోటి స్వరపరిచిన ఎవర్ గ్రీన్ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ కి ఆల్ టైం ఫెవరెట్. అసలు ఒక్క ఫైట్ లేకుండా, విలన్లను పెట్టకుండా, సెకండ్ హీరోయిన్ ప్రస్తావన తేకుండా మూడు గంటల పాటు థియేటర్లలో ఆడియన్స్ ని కూర్చోబెట్టడం కష్టం. నువ్వు నాకు నచ్చావ్ ఈజీగా దాన్ని చేసి చూపించి బ్లాక్ బస్టర్ అందుకుంది. 23 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ చూసేందుకు ఇంత కన్నా బెస్ట్ ఛాయస్ కావాలా.

This post was last modified on January 3, 2024 1:13 pm

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

22 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

28 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

2 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

3 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 hours ago