అ!, జాంబిరెడ్డి లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసి దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు అతడి నుంచి రాబోతున్న హనుమాన్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముందు చిన్న సినిమాగానే మొదలైన హనుమాన్.. రిలీజ్ టైం కి ఒక రేంజ్ సినిమాగా మారింది. ఏకంగా సంక్రాంతికి మరో నాలుగు పెద్ద సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తుండడం, మహేష్ బాబు సినిమా గుంటూరు కారం రిలీజ్ అయ్యే జనవరి 12కే దీన్ని కూడా షె డ్యూల్ చేయడం చిత్ర బృందం కాన్ఫిడెన్స్ కు నిదర్శనం.
ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు అతడి కాన్ఫిడెన్స్ హద్దులు దాటుతున్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అతను చేసిన ఒక కామెంట్ చర్చనీయాంశంగా మారింది. హనుమాన్ సరిగ్గా వర్కౌట్ అయితే తాను అవతార్ ను మించిన సినిమా తీస్తానన్నట్లుగా మాట్లాడాడు ప్రశాంత్.
తాను తీయబోయే భారీ చిత్రాలకు హనుమాన్ ఒక పునాది అన్నట్లు చెప్పాడు. ఈ కామెంట్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఏకంగా అవతార్ ను మించిన సినిమా అనేసరికి ప్రశాంత్ తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడన్నట్లు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ ట్రోలింగ్ గమనించిన ప్రశాంత్.. ట్విట్టర్లో జవాబు ఇచ్చాడు. పెద్ద పెద్ద కలలు కనడంలో తప్పేమీ లేదని, అప్పుడే బౌండరీలు చెరిపేసి ముందుకు సాగగలమని.. హనుమాన్ వర్కౌట్ అయితే వీఎఫ్ఎక్స్ ఆధారంగా అవతార్ తరహాలో భారీ చిత్రాలు చేయడానికి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కు డోర్స్ ఓపెన్ అవుతాయని.. ఆ ఉద్దేశంతోనే తాను ఆ కామెంట్ చేశానని వివరణ ఇచ్చాడు.
This post was last modified on January 2, 2024 8:03 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…