పూర్తిగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో సినిమాలు ఒకప్పుడు చాలానే వచ్చేవి కానీ గత కొన్నేళ్లలో తగ్గిపోయాయి. క్రమంగా మన హీరోలకు వీటి మీద మనసు పెరుగుతోంది. దానికి నిదర్శనమే ఎంచుకుంటున్న పోస్టర్లు, వాటి వెనుక ఉన్న కథలు. నాగ చైతన్య ‘తండేల్’ పూర్తిగా ఈ నేపథ్యంలో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమకథకు ఒక విభిన్నమైన ట్రీట్ మెంట్ తో యాక్షన్, థ్రిల్ రెండూ మిక్స్ చేస్తూ దర్శకుడు చందూ మొండేటి భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఇంకా పెద్ద స్పాన్ తో ప్యాన్ ఇండియా స్థాయిలో నీటి అలల మీద జరిగే రక్తపాతంతో కొరటాల శివ తారక్ ని చూపించబోతున్నారు.
గత ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో హీరో చేపలు పట్టే బోటువాడిగా కనిపించాడు. వైష్ణవ్ తేజ్ డెబ్యూ ‘ఉప్పెన’లో బుచ్చిబాబు ఏకంగా హీరో హీరోయిన్ రొమాన్స్ ని పడవ మీద నడిపించి వాహ్ అనిపించి జాతీయ అవార్డు దాకా తీసుకెళ్లాడు. చూస్తుంటే సముద్రం, పడవ ఈ రెండు సక్సెస్ ఫార్ములాగా మారేలా ఉన్నాయి. అందుకే రచయితలు, దర్శకులు నీటిని మెయిన్ సబ్జెక్టుగా తీసుకుని కథలు రాస్తున్నారు. దశాబ్దాల క్రితం ఈ తరహా ట్రీట్మెంట్ తో వచ్చిన వాటిలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. చిరంజీవి ఆరాధన, జగపతిబాబు సముద్రం కొన్ని ఉదాహరణలు.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కాన్సెప్ట్ కొత్త కాకపోయినా ప్రెజెంటేషన్ లో వైవిధ్యాన్ని చూపిస్తూ ఫిలిం మేకర్స్ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్య ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేదు. కానీ స్టార్ హీరోలకు ఇబ్బంది లేదు. హిట్లు పడుతున్నాయి. దేవర, తండేల్ రెండూ ఈ ఏడాదే విడుదల కానున్నాయి. వీటిలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. బడ్జెట్ కూడా ఆ కారణంగానే భారీగా పెరుగుతోంది. అన్నట్టు సూర్య కంగువ కూడా అధిక శాతం సముద్ర తీర ప్రాంతంలోనే జరుగుతుందని యూనిట్ నుంచి అందుతున్న సమాచారం.
This post was last modified on January 1, 2024 10:27 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…