జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవర ప్రపంచాన్ని ఈ నెల 8న పరిచయం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఒక కొత్త పోస్టర్ ద్వారా అఫీషియల్ గా చెప్పడంతో ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడిన అభిమానులకు రిలీఫ్ కలిగింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం గ్లిమ్ప్స్ వీడియోలో కథను రివీల్ చేయకుండా దేవర తిరిగే సముద్రాన్ని, ఘాడతని, ఆలల మధ్య ఎదుర్కునే ఆటుపోట్లని ఊహించిన దానికన్నా చాలా గొప్ప స్థాయిలో చూపించబోతున్నట్టు తెలిసింది. తారక్ కొన్ని సెకండ్ల పాటే కనిపించినా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఖాయమంటున్నారు.
ఏప్రిల్ 8 విడుదల కాబోతున్న దేవర చేతిలో వంద రోజులు కూడా లేవు. ఉన్న తక్కువ టైంలోనే బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేసేసి ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టాలి. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ని వేగంగా జరిపిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి తగినంత సమయం ఇవ్వాలి కాబట్టి వీలైనంత త్వరగా ఫస్ట్ కాపీని సిద్ధం చేస్తే తప్ప టెన్షన్ తొలగిపోదు. పాటల చిత్రీకరణకు సంబంధించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. రెగ్యులర్ ఫార్మెట్ లో అయిదు పాటల ట్రెండ్ ని కొరటాల తారక్ ఫాలో కావడం లేదని తెలిసింది.
సో సలార్ లాగా కేవలం సబ్జెక్టు డిమాండ్ చేసే సాంగ్స్ మాత్రమే దేవరలో ఉండొచ్చని వినికిడి. తారక్ జాన్వీ కపూర్ మధ్య ఒక బీట్ సాంగ్ ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. డెవిల్ ఇంటర్వ్యూలలో ఈ ప్యాన్ ఇండియా సినిమా గురించి కళ్యాణ్ రామ్ గొప్పగా వర్ణించి చెప్పడంతో అంచనాలు అంతకంతా పెరుగుతున్నాయి. దేవర 2 ఉంటుంది కాబట్టి మొదటి భాగంలో ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. ఇప్పటికైతే ఏప్రిల్ 5 ఎలాంటి పోటీ లేదు. ఆపై వారం సూర్య కంగువా లేదా కమల్ హాసన్ భారతీయుడు 2 వచ్చే అవకాశానని కొట్టిపారేయలేం.
This post was last modified on January 1, 2024 11:33 am
అసలు సాధ్యమే కాదని భావించింది నిజమయ్యింది. రాజమౌళి రికార్డులు మళ్ళీ ఆయనే తప్ప ఇంకెవరు బ్రేక్ చేయలేరనే వాదన బద్దలయ్యింది.…
తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పిన…
ఏపీలో కూటమి సర్కారుకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకవైపు ఉపాధి, ఉద్యోగాల కల్పనతో ముందుకు సాగు తున్న సర్కారుకు.. ఇప్పుడు…
గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వెళ్లి వస్తున్న క్రమంలో హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై…
విడుదల ఇంకో నాలుగు రోజుల్లో ఉందనగా తమిళ గేమ్ ఛేంజర్ కు కొత్త సమస్యలు వస్తున్నట్టు చెన్నై అప్డేట్. ఇండియన్…
కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ…