విశ్వక్ సేన్ కి నిర్మాణం, దర్శకత్వం కొత్త కాదు కానీ వేరే హీరోలతో ప్రొడక్షన్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. కొత్త బ్యానర్ లో కొత్తవాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో తొలి ప్రాజెక్టుగా కల్ట్ ని ఇవాళ అధికారికంగా ప్రకటించాడు. తాజుద్దీన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. క్యాస్టింగ్ తదితర వివరాలు ఇంకా చెప్పలేదు కానీ రాబోయే రోజుల్లో ఇరవైకి పైగా న్యూ కుమార్స్ ని ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్లాన్ తో మొత్తం సెట్ చేసుకున్నాడట. దీని కోసమే ఒక్కడే ప్రెస్ మీట్ నిర్వహించి మరీ తన మనసులో మాటలను మీడియాతో పంచుకున్నాడు.
కెరీర్ మెల్లగా కుదురుకుంటున్న టైంలో ఇలా ప్రొడ్యూసర్ గా రూటు మార్చడం వెనుక విశ్వక్ కు పెద్ద ప్లానే ఉంది. సరైన కంటెంట్ ఇస్తే కనక ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారని ఈ సంవత్సరం బలగం, బేబీలు నిరూపించాయి. రెండూ కొత్త దర్శకులు హ్యాండిల్ చేసినవే. యాభై నుంచి వంద కోట్ల దాకా వసూళ్లు రాబట్టినవి. అప్ కమింగ్ డైరెక్టర్ తీసిన సామాజవరగమన సైతం ఘనవిజయం సాధించింది. సో కథా కథనాల విషయంలో జాగ్రత్త వహిస్తే సాలిడ్ గా సూపర్ హిట్లు కొట్టొచ్చని అర్థమైపోయింది. అందుకే విశ్వక్ సేన్ ఓన్ ప్రొడక్షన్ చేసేందుకు సిద్ధమైపోయాడు.
ఇక మార్చ్ లో విడుదల కాబోతున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రమోషన్లు ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టబోతున్నారు. డిసెంబర్ 8 విడుదల కాకపోతే ప్రమోషన్లకు దూరంగా ఉంటానని విశ్వక్ శపథం చేయడం, ఆ తర్వాత నిర్మాత చొరవతో ఇష్యూ చల్లారిపోవడం జరిగిపోయాయి. దాని గురించైతే విశ్వక్ ఎక్కువగా మాట్లాడ్డం లేదు కానీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెయిట్ చేయాలి. గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో హీరో, విలన్, దర్శకుడిగా మూడు పాత్రలు పోషించినా రిజల్ట్ మాత్రం సోసోగానే వచ్చింది. మరి కల్ట్ తో పట్టిన కొత్త బాట ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
This post was last modified on December 31, 2023 12:55 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…