Movie News

చరణ్ ముంబై ట్రిప్పుల వెనుక మతలబేంటి

ఎప్పుడూ లేనిది రామ్ చరణ్ ఈ మధ్య ముంబైకి బాగా తిరిగేస్తున్నాడు. మొదట్లో ఏదో పర్సనల్ ట్రిప్ కోసమని అందరూ అనుకున్నారు కానీ ఏకంగా ఒక ఫ్లాట్ తీసుకుని మరీ వెళ్ళినప్పుడంతా అక్కడ మకాం వేయడం కొత్త వార్తలకు చోటిచ్చింది. అధిక సందర్భాల్లో సతీ సమేతంగా వెళ్లిన చరణ్ తన పర్యటనకు సంబంధించి ఎయిర్ పోర్ట్, గుళ్ళు గోపురాల ఫోటోలు వీడియోలు తప్ప ఇంకేదీ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ధూమ్ 4ని యష్ రాజ్ ఫిలిమ్స్ షారుఖ్ ఖాన్ తో ప్లాన్ చేస్తోందని, అందులో మరో హీరోగా చరణ్ నే అనుకుంటున్నారని ప్రచారం మొదలైపోయింది.

వాస్తవానికి ధూమ్ 4 ప్రతిపాదన నిజమే కానీ అది షారుఖ్ చరణ్ కాంబినేషన్ లో మాత్రం కాదని ముంబై వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఏడాది మూడు సినిమాలతో అభిమానులకు నాన్ స్టాప్ ట్రీట్ ఇచ్చిన బాద్షా 2024లో తెరమీద కనిపించకపోవచ్చు. బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. అసలు ధూమ్ 4 కథే తన దగ్గరకు వెళ్లలేదని వినికిడి. ఒకవేళ చరణ్ తో నిజంగా ఫిక్స్ చేయాలనుకున్నా ఆ మల్టీస్టారర్లో  వేరే హీరోని భాగం చేస్తారని తెలిసింది. ఇది కాసేపు పక్కనపెడితే పలువురు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తో రామ్ చరణ్ చర్చలు జరిపి వస్తున్న మాట వాస్తవం.

జంజీర్ టైంలో తనను ట్రోలింగ్ చేసే రేంజ్ లో వార్తలు రాసిన నార్త్ మీడియాతోనే మెచ్చుకోలు పొందాలంటే ఒక స్ట్రెయిట్ హిందీ మూవీ ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని చూస్తున్న చరణ్ దాన్ని ఆర్ఆర్ఆర్ తో కొంత భాగం నెరవేర్చుకున్నా అది డబ్బింగ్ మూవీ కావడం వల్ల టార్గెట్ పూర్తిగా చేరుకున్నట్టు కాదు. సంజయ్ లీలా భన్సాలీ, మధుర్ బండార్కర్, అశుతోష్ గోవరికర్ తదితరులు టాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కానీ సాధ్యపడటం లేదు. రామ్ చరణ్ తో డిజిటల్ డెబ్యూ చేయించేందుకు నెట్ ఫ్లిక్స్ కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు ఓటిటి వర్గాల కథనం. 

This post was last modified on December 30, 2023 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

3 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

4 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

6 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

8 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

8 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

9 hours ago