ఆటోనగర్ సూర్య.. విలక్షణ దర్శకుడు దేవా కట్టా కెరీర్‌ను అల్లకల్లోలం చేసిన సినిమా. మొదలు పెట్టిన మూడేళ్లకు కానీ ఇది పూర్తి కాలేదు. షూటింగ్ మధ్యలో ఆగిపోయి, విడుదల కోసం చాలా కాలం ఎదురు చూసిందీ చిత్రం. మేకింగ్ దశలో చాలా ఇబ్బందుల్ని అధిగమించి అతి కష్టం మీద ఈ సినిమాను బయటికి తీసుకొచ్చాడు దేవా. చివరికి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. దీని వల్ల దేవా కెరీర్లో విలువైన కాలం వృథా అయింది. ఆ సినిమా తర్వాత అతను ఏ దశలోనూ కోలుకోలేదు. కెరీర్లో మరింత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత చేసిన డైనమైట్ కూడా ఆడలేదు. హిందీలో చేసిన ప్రస్థానం కూడా తేడా కొట్టింది. చివరికిప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మొదలుపెట్టాడు. లాక్ డౌన్ తర్వాత ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది.
ఐతే తన కెరీర్ దెబ్బ తినడానికి కారణమైన ఆటోనగర్ సూర్య సినిమా అలా తయారవడానికి నిర్మాతలే కారణమని ఓ ఇంటర్వ్యూలో దేవా అసహనం వ్యక్తం చేశాడు. నిర్మాతలు అని కానీ.. వారి పేర్లు కానీ చెప్పకుండా ఆ సినిమా విషయంలో తాను కొందరు దొంగల ముఠా కారణంగా మోసానికి గురయ్యానని దేవా చెప్పాడు. వెన్నెల, ప్రస్థానం సినిమాలు మాత్రమే పూర్తిగా తన నియంత్రణతో తెరకెక్కాయని.. తర్వాత తాను చేసిన సినిమాలు తన చేతులు దాటి వెళ్లిపోయాయని దేవా అన్నాడు. ఆటోనగర్ సూర్య సినిమాను నిర్మించింది ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఒక దశలో మంచి ఊపుతో కనిపించిన ఈ సంస్థ.. ఉన్నట్లుండి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆటోనగర్ సూర్య కంటే ముందు నాగార్జున నటించిన ఢమరుకం సైతం ఇలాగే ఇబ్బందుల్లో చిక్కుకుని ఆలస్యంగా విడుదలైంది. ఆటోనగర్ సూర్య తర్వాత ఈ సంస్థ మూతపడిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 27, 2020 10:14 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…