మాస్ మహారాజా రవితేజ హనుమాన్ లోని కోటి అనే కీలకమైన ఒక కోతి పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. ఈగల్ కు ఒక రోజు ముందు పోటీగా వస్తున్నా సరే అదేమీ పట్టించుకోకుండా తన వంతు చేయూతనివ్వడం మంచిదే. మాస్ మహారాజా ఇలా గొంతు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. రాజమౌళి ‘మర్యాదరామన్న’లో సునీల్ తొక్కే సైకిల్ కి ఆయన ఇచ్చిన మాటలు థియేటర్లో మాములుగా పేలలేదు. మంచు విష్ణు ‘దూసుకెళ్తా’లో వాయిస్ ఓవర్, నాని నిర్మించిన ‘అ!’ లో చెట్టుకి తనే స్వరం కావడం, ‘మహావీరుడు’లో ఆకాశవాణిగా వినిపించడం ఇవన్నీ హిట్లే.
ఇదంతా బాగానే ఉంది కానీ కోటికి గొంతు రవితేజ ఇస్తున్నప్పుడు మరి అసలైన హనుమంతుడికి ఎవరు ఇస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ట్రైలర్ చూశాక ఆ కళ్ళు చిరంజీవిని పోలి ఉన్నాయని, ఇష్టమైన దైవం కనక ఆయనేమైనా స్పెషల్ క్యామియో చేశారేమోనని ఫ్యాన్స్ సందేహపడ్డారు. కానీ అలాంటిదేమి లేదట. హనుమాన్ సాక్షాత్కారం ఉంటుంది కానీ అది ఎవరూ పోషించలేదని, పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ సృష్టించిన ఒక రూపాన్ని మాత్రమే చూస్తారని, మాటలు కూడా ఉండవని యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. తేజ సజ్జ బాడీలోకి ప్రవేశించి తనతోనే పలుకుతాడట.
సో ఒక ముఖ్యమైన డౌట్ తీరిపోయినట్టే. జనవరి 12 విడుదల కాబోతున్న హనుమాన్ ని ముందో వెనుకో వచ్చేలా డేట్ మార్చుకోమని ఎంత ఒత్తిడి వస్తున్నా సరే నిర్మాత మాత్రం తగ్గడం లేదు. తెలుగులో థియేటర్లు తక్కువ దొరికినా సరే మంచి టైంలో నార్త్ ఇండియాలో దొరికిన అవకాశాన్ని పోగొట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారని తెలిసింది. గ్రాఫిక్స్ మూవీ అయినప్పటికీ ఎమోషన్ ప్లస్ డివోషన్ సరైన పాళ్ళలో కలిపి దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త అనుభూతినిస్తాడని అంటున్నారు. కాకపోతే మహేష్ బాబు, వెంకటేష్, రవితేజ, నాగార్జునలతో పోటీ అయితే అంత సులభం కాదు.
This post was last modified on December 27, 2023 2:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…