మాములుగా ఎంత పెద్ద బ్లాక్ బస్టరైనా సరే వీకెండ్ తర్వాత నెమ్మదించడం సహజం. దానికి ఎవరూ మినహాయింపు కాదు. చాలా అరుదుగా అది కూడా ఎక్కువ సెలవులు ఉన్న టైంలో హౌస్ ఫుల్స్ కొనసాగుతుంటాయి. కానీ సలార్ కు అయోమయంతో కూడిన విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. నిన్న హఠాత్తుగా బుధు, గురువారాలకు సంబంధించిన హిందీ వెర్షన్ బుకింగ్స్ పలు మల్టీప్లెక్సులు మొదలుపెట్టాయి. అందులో ఏముంది అనుకోవద్దు. తెల్లవారుఝమున అయిదు, ఆరు గంటలకు షోలు చూపించి వాటిని బ్లాక్ చేసి పెట్టారు. అంటే హౌస్ ఫుల్ అని జనం అనుకునేలా.
నిజానికి ఇంత చలిలో వర్కింగ్ డే రోజు అంత ఉదయాన్నే టికెట్లు మొత్తం అమ్ముడుపోవడం అసాధ్యం. దీన్ని పట్టుకుని నార్త్ ట్రేడ్ విశ్లేషకులు, తమను దెబ్బ కొట్టారన్న దుగ్దతో ఉన్న షారుఖ్ ఖాన్ అభిమానులు స్క్రీన్ షాట్లు తీసి ఇదిగో కార్పొరేట్ బుకింగ్ అంటూ బురద జల్లడం మొదలుపెట్టారు. ఏదో ఒకటి రెండు చోట్ల అంటే ఏమో అనుకోవచ్చు. కానీ అన్ని మల్టీప్లెక్సుల్లో ప్రతి ఉదయం ఆట ఫుల్ కావడమంటే అనుమానించాల్సిన విషయమే. ఇది ట్రోలింగ్ కి దారి తీస్తోంది. కొందరు రిలీజ్ కు ముందు పివిఆర్ ఐనాక్స్ తో షోల షేరింగ్ తో తలెత్తిన సమస్యతో దీన్ని ముడిపెడుతున్నారు.
నిజానిజాలు వీలైనంత త్వరగా హోంబాలే ఫిలింస్ తవ్వి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కావాలని కలెక్షన్ల కోసం ఇలా స్పెషల్ షోలను ఫుల్ చేసి చూపిస్తున్నారనే యాంటీ ఫ్యాన్స్ విమర్శలకు సమాధానం చెప్పకపోతే అది తప్పుడు సంకేతాలకు దారి తీస్తుంది. హిందీలో సలార్ రికార్డులు బద్దలు కొట్టకపోయినా వంద కోట్లను దాటికి మంచి రన్ కొనసాగిస్తోంది. అలాంటప్పుడు ఇలాంటి ప్రచారాలు జరగడం ఎంత మాత్రం మంచిది కాదు. క్రిస్మస్ తర్వాత తెలుగులోనే వేయని స్పెషల్ షోలు ఢిల్లీ, ముంబై, కోల్కతాలో వేశారంటే ఇదేదో కుట్రలాగే ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
This post was last modified on December 27, 2023 10:48 am
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…